నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన, మూవీ,’ ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend Movie). అందాల రాక్షసి సినిమాతో హీరోగా మెప్పించి, చిలసౌ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించాడు.ఈ సినిమాలో, దీక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించాడు. నవంబర్ 07న థియేటర్లలో విడుదలైన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది.
Read Also: Mehreen Pirzada: IndiGo పై నటి మెహ్రీన్ అసహనం
చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా (The Girlfriend Movie) రూ. 28 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు, ఈ సినిమా, ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ఈరోజు నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
కథేంటంటే
భూమా (రష్మిక మందన్న) పీజీ చేయడానికి హైదరాబాద్ లోని ఓ కాలేజ్ లో జాయిన్ అవుతుంది. అదే కాలేజ్ లో పీజీ చేయడానికి వచ్చిన విక్రమ్ (దీక్షిత్ శెట్టి) భుమాని ఇష్టపడతాడు. ఒక బలహీనమైన క్షణంలో భూమా కూడా విక్రమ్ ని ఇష్టపడుతుంది. విక్రమ్ కి జెలసీ, పోసిస్సివెన్స్ ఎక్కువ. తనది పాత కాలం మనస్తత్వం.
విక్రమ్ తో రోజులు గడుపుతున్నకొద్ది భూమాకి కొన్ని విషయాలు అర్ధమౌతూవస్తుంటాయి. రిలేషన్షిప్ లో ఓ చిన్న బ్రేక్ కావాలని ఆడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విక్రమ్ ఎలా రియాక్ట్ అయ్యాడు ? ఈ కథలో దుర్గా (అను ఇమ్మానుయేల్) పాత్ర ఏమిటి? చివరికి భూమా ఎలాంటి నిర్ణయం తీసుకుందనేది మిగతా కథ.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: