📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త NAARMలో ఉద్యోగాలు.. త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం నేటి బంగారం ధర ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల ‘అఖండ 2’ మూవీ రివ్యూ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ NAARMలో ఉద్యోగాలు.. గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త NAARMలో ఉద్యోగాలు.. త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం నేటి బంగారం ధర ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల ‘అఖండ 2’ మూవీ రివ్యూ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ NAARMలో ఉద్యోగాలు.. గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2

Telugu news: The Devil First Review: ది డెవిల్ ఫస్ట్ రివ్యూ

Author Icon By Tejaswini Y
Updated: December 11, 2025 • 4:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
The Devil First Review

The Devil First Review: కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వివాదాలకు కారణమయ్యే స్టార్ హీరోల్లో దర్శన్ ఒకరు. ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ‘ది డెవిల్’ విడుదల కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అభిమానిగా ఉన్న రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ అరెస్టై జైలులో ఉన్న సమయంలో ఈ సినిమా థియేటర్లకు రావడంతో మూవీపై ఆసక్తి మరింత పెరిగింది. వైష్ణో స్టూడియోస్, జై మాతా కంబైన్స్ బ్యానర్లపై దర్శకులు ప్రకాశ్, జే జయమ్మ కలిసి ఈ సినిమాను నిర్మించారు. రచన రాయ్ హీరోయిన్‌గా దర్శన్‌కు జోడీగా నటించగా, మహేష్ మంజ్రేకర్, అచ్యుత్ కుమార్, షర్మిలా మాండ్రే, శోభరాజ్, తులసి శివమణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Read Also: Hardik Pandya: AMB Cinemas మాల్‌ను సందర్శించిన హార్దిక్

టెక్నికల్ విభాగం విషయానికి వస్తే

ప్రకాశ్ దర్శకత్వం, సుధాకర్ ఎస్. రాజ్ ఛాయాగ్రహణం, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలాలు. యాక్షన్, డ్రామా జానర్‌లో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, విడుదలకు ముందే రూ.5 కోట్లకు పైగా బిజినెస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దర్శన్ స్టార్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువగా ఉండటంతో కొన్ని సన్నివేశాలు, డైలాగులపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సూచించిన మార్పులు చేసిన తర్వాత సెన్సార్ బోర్డు సినిమాకు క్లియరెన్స్ ఇచ్చింది. చివరకు ‘ది డెవిల్’ కు U/A 16+ సర్టిఫికేట్ మంజూరు చేశారు. అంటే 16 ఏళ్లు పైబడిన ప్రేక్షకులు ఎలాంటి ఆంక్షలు లేకుండా చూడొచ్చు. 16 కంటే తక్కువ వయసు ఉన్నవారు మాత్రం తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాత్రమే సినిమా చూడాలని బోర్డు స్పష్టం చేసింది.

ఈ సినిమాకు రన్‌టైమ్ కూడా గణనీయంగా ఎక్కువగా ఉంది. కథనంలోని యాక్షన్ సన్నివేశాలు, డ్రామా తీవ్రత కారణంగా మొత్తం నిడివి 2 గంటలు 49 నిమిషాలు 16 సెకన్లు (169 నిమిషాలు 16 సెకన్లు) గా ఫిక్స్ అయ్యింది. ప్రత్యేక పరిస్థితుల్లో విడుదలవుతున్న ఈ సినిమా దర్శన్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. సినిమా ఎలా ఉందన్నది విడుదలయ్యాకే తెలిసినా, ఇప్పటివరకు వచ్చిన అప్డేట్లన్నీ ఈ మూవీపై హైప్‌ను మరింత పెంచుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Darshan Darshan New Movie Kannada Cinema The Devil Censor Report The Devil Movie The Devil Runtime

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.