📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

The Bluff: ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

Author Icon By Tejaswini Y
Updated: March 12, 2026 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

The Bluff: గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ‘ది బ్లఫ్’ ప్రస్తుతం డిజిటల్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 25న నేరుగా విడుదలైన ఈ చిత్రం, స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే అత్యధిక మంది చూసిన ఒరిజినల్ ఫిల్మ్‌గా అగ్రస్థానానికి చేరుకుంది.

Read Also : Hansika Motwani Divorce: 4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

వ్యూయర్ షిప్‌లో నయా రికార్డ్

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ మ్యాగజైన్ ‘వెరైటీ’ నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 27 నుండి మార్చి 5 మధ్య కాలంలో ‘ది బ్లఫ్’ సుమారు 300.3 మిలియన్ నిమిషాల వ్యూయింగ్ టైమ్‌ను నమోదు చేసింది. ఈ గణాంకాలతో ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన ‘స్ట్రీమింగ్ ఒరిజినల్స్: ఫిల్మ్’ చార్ట్‌లో ఈ చిత్రం నంబర్ వన్ ప్లేస్‌ను దక్కించుకుంది.

The Bluff: Priyanka Chopra’s ‘The Bluff’ is the number one movie on OTT!

టాప్ 5 సినిమాల జాబితా:

  1. ది బ్లఫ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో): 300.3 మిలియన్ మినిట్స్
  2. అక్యూజ్డ్ (నెట్‌ఫ్లిక్స్): 213.1 మిలియన్ మినిట్స్
  3. ఫైర్‌బ్రేక్ (నెట్‌ఫ్లిక్స్): 177.2 మిలియన్ మినిట్స్
  4. పాల్ మెక్‌కార్ట్నీ: మ్యాన్ ఆన్ ది రన్ (ప్రైమ్ వీడియో): 156.2 మిలియన్ మినిట్స్
  5. ది వ్రెకింగ్ క్రూ (ప్రైమ్ వీడియో): 110.6 మిలియన్ మినిట్స్

Read Also:Raviteja: ‘ఇరుముడి’ కీలక పాత్ర లో తమన్నా భాటియా?

‘బ్లడీ మేరీ’గా ప్రియాంక విశ్వరూపం

పైరేట్ నేపథ్యంలో సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో ప్రియాంక చోప్రా ‘బ్లడీ మేరీ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమాకు విమర్శకుల నుండి మిశ్రమ స్పందన (Mixed Talk) వచ్చినప్పటికీ, యాక్షన్ ప్రియులు మరియు ప్రియాంక అభిమానులు ఈ చిత్రాన్ని తెగ చూసేస్తున్నారు. ముఖ్యంగా సముద్రపు దొంగల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

సెలబ్రేషన్స్‌లో ఫ్యాన్స్

తమ అభిమాన నటి సినిమా ప్రపంచవ్యాప్త చార్ట్స్‌లో టాప్‌లో ఉండటంతో ప్రియాంక ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు. “ఆమె కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది”, “ది బ్లఫ్ ఒక అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్” అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన అనుభూతి కశ్యప్ చిత్రం ‘అక్యూజ్డ్’ను వెనక్కి నెట్టి మరీ ప్రియాంక సినిమా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

OTT Streaming Records Priyanka Chopra The Bluff The Bluff Movie Reviews The Bluff OTT The Bluff Views

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.