📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Shalini Pandey: ఆ సినిమా వల్లే నాకు గుర్తింపు వచ్చింది : షాలిని పాండే

Author Icon By Anusha
Updated: September 29, 2025 • 9:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన “అర్జున్ రెడ్డి” చిత్రం (“Arjun Reddy” movie) తెలుగు సినీ పరిశ్రమలో కొత్త దిశ చూపిన సినిమా. ఈ సినిమాలో కథానాయికగా అడుగుపెట్టిన షాలిని పాండే, తన నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. ఈ సినిమా ఆమె కెరీర్‌లో ఒక కీలక మలుపు సాధించినట్లు చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)సరసన ఆమె చేసిన రోల్స్ ప్రేక్షకుల నుండి విశేషమైన ప్రశంసలు అందుకున్నాయి.

Chiranjeevi : బాలయ్య – చిరంజీవి వివాదం : మెగా అభిమానుల సమావేశం కలకలం

ఆ సినిమా తన కెరీర్‌ను ఏ విధంగా మలుపు తిప్పిందో, నటిగా తనపై ఎలాంటి ప్రభావం చూపిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్నారు (Shalini Pandey). ఆ సినిమా విజయం తనకు ఒత్తిడి కంటే ఎక్కువగా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని ఆమె స్పష్టం చేశారు.’అర్జున్ రెడ్డి’ సినిమా అనుభవాల గురించి షాలినీ పాండే మాట్లాడుతూ, “ఆ సినిమా చేస్తున్నప్పుడు మేమంతా కొత్తవాళ్లం.

అది మా అందరికీ దాదాపు మొదటి సినిమా. అందరం కలిసి ఒక మంచి సినిమా చేయాలనే తపనతో పనిచేశాం. సినిమా (Cinema) విడుదలై అంత పెద్ద విజయం సాధించిన తర్వాత, నాపై ఒత్తిడి పెరుగుతుందని చాలామంది అనుకున్నారు. కానీ నిజానికి నాకు నటిగా మంచి గుర్తింపు లభించిందనే భావన కలిగింది.

Shalini Pandey

నా కోరిక నెరవేరినందుకు ఎంతో సంతోషంగా

నటి కావాలన్న నా కోరిక నెరవేరినందుకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ సమయంలో ఒత్తిడిని ఎలా తీసుకోవాలో కూడా నాకు తెలియదు. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాగే మంచి సినిమాలు చేయాలని మాత్రమే అనుకున్నాను” అని వివరించారు.తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ, “దేవుడి దయవల్ల, ఒక నటిగా నా ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగుతోంది.

‘అర్జున్ రెడ్డి’ లాంటి ఒక మంచి ప్రాజెక్టుతో నా కెరీర్ మొదలైంది. ఆ చిత్రంలో నేను పనిచేసిన వ్యక్తులు, నాకు అండగా నిలిచిన టీమ్ (Team) వల్లే ఆ ప్రయాణం మరింత ప్రత్యేకంగా మారింది. అప్పటి నుంచి నేను పనిచేసిన సినిమాల్లో కూడా మంచి నటులు, దర్శకులతో పనిచేసే అవకాశం లభించింది.

ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని” అని ఆమె తెలిపారు.2017లో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో షాలినీ పాండే మెడికల్ విద్యార్థిని పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Arjun Reddy Arjun Reddy success Breaking News latest news Shalini Pandey Shalini Pandey interview Telugu News Tollywood Actress Tollywood News Vijay Deverakonda

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.