📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

ఓటీటీ లోకి తండేల్ డేట్ ఖరారు.

Author Icon By Anusha
Updated: February 25, 2025 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన మూవీ తండేల్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, అల్లు అరవింద్ సమర్పణలో, గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించారు. ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ట్రైలర్, సాంగ్స్ విపరీతంగా ప్రేక్షకులకు నచ్చాయి. తండేల్ సినిమాలో సాయి పల్లవి, నాగచైతన్య ఇద్దరూ తమ నటనతో మెప్పించారు.

సక్సెస్ టాక్

తండేల్ మూవీ ఫిబ్రవరి 7న విడుదల అయ్యింది. ఈ సినిమా లవ్ స్టోరీతో పాటు, భావోద్వేగాలు కలబోసిన కథతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నాగ చైతన్య (రాజు), సాయి పల్లవి (సత్య) పాత్రలు ఎంతో బలమైనవి. ముఖ్యంగా నాగ చైతన్య ఎమోషనల్ సీన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు. ప్రేమకథతో పాటు అందమైన విజువల్స్, ఆకట్టుకునే కథనంతో దర్శకుడు చందూ మొండేటి సినిమాను తీర్చిదిద్దారు.సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని మంచి వసూళ్లను తన ఖాతాలో వేసుకుంటుంది. చైతూ కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

సంగీతం

ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరో ప్రధాన ఆకర్షణ. పాటలన్నీ ఇప్పటికే సూపర్ హిట్ కాగా, బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ప్రేమకథను, ఎమోషన్లను ఎలివేట్ చేసే విధంగా మ్యూజిక్ ఉండటంతో ప్రేక్షకుల హృదయాలకుహత్తుకుంది.

ఓటీటీ రిలీజ్ డేట్

తండేల్ సినిమా థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా ముగించుకున్న తర్వాత, అభిమానులు ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఇక తండేల్ సినిమా స్ట్రీమింగ్ డేట్ మార్చి 14గా ఖరారైనట్లు తెలుస్తోంది. ముందుగా మార్చ్ 6న అని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు మార్చి 14న ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారు.

ఇప్పటికే థియేటర్లలో విజయం సాధించిన తండేల్, ఓటీటీలో కూడా అదే స్థాయిలో ఆదరణ పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ, ఎమోషనల్ ఎలిమెంట్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ , త్వరలోనే తండేల్ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన రాబోతోంది.ఒక మంచి కథ, అద్భుతమైన నటన, ఎమోషనల్ కంటెంట్‌తో తండేల్ మూవీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. థియేటర్లలో హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా, మార్చి 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుండటంతో, మరింత మంది ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

#Nagachaitanya #Netflix #ottrelease #SaiPallavi #thandel movie #Tollywood Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.