📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Thalapathy Vijay: దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం..’27’ సంఖ్య భయం!

Author Icon By Aanusha
Updated: March 2, 2026 • 12:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Thalapathy Vijay: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా వెలుగొంది, ఇటీవల ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో రాజకీయ ప్రవేశం చేసిన దళపతి విజయ్ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా దూసుకుపోతున్న ఆయనకు, అటు రాజకీయంగా ఇటు వ్యక్తిగతంగా వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి.

Read Also: CJI visit AP: కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

సరికొత్త రాజకీయాల దిశగా విజయ్ అడుగులు

తమిళనాడు రాజకీయాల్లో మార్పు తెస్తానని ప్రకటించిన విజయ్, ఇప్పటికే అధికార డీఎంకే ,ప్రతిపక్ష బీజేపీలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. తన పార్టీ విధివిధానాలతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఆయన, క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే, రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలనే లక్ష్యంతో ఉన్న విజయ్‌కు కొన్ని పరిణామాలు మింగుడు పడటం లేదు.

Thalapathy Vijay’s political debut..’27’ is a fearsome number!

విడాకుల వార్తలు – నెట్టింట జోరుగా చర్చ

విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతేడాది సెప్టెంబర్ 27వ తేదీన జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటన.. తర్వాత వరుసగా గత 6 నెలలుగా ఏదో ఒక సంఘటన 27వ తేదీన జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ 27 సంఖ్యకు, విజయ్‌కి మధ్య ఏదో లింక్ ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్ట్‌ చేస్తున్నారు.

పెళ్లి అయిన 27 ఏళ్ల తర్వాత.. ఇటీవలె సంగీత విడాకులు కావాలంటూ చెంగల్‌పట్టు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనలు అన్నీ 27వ తేదీనే జరుగుతుండటం యాదృచ్ఛికమా లేక దీని వెనుక ఏదైనా అనుబంధం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tamil Nadu elections 2026 TVK Party Updates Vijay Number 27 Vijay Sangeetha divorce rumors

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.