📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Thalapathy Vijay: ‘జననాయగన్’ విడుదలకు తప్పని అడ్డంకులు

Author Icon By Anusha
Updated: February 23, 2026 • 12:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Thalapathy Vijay: తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించిన నేపథ్యంలో, ఆయన ఆఖరి చిత్రం ‘జననాయగన్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నటుడిగా ఆయన ప్రస్థానంలో ఇది చివరి సినిమా కావడంతో అభిమానులు ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే, ఈ చిత్రం విడుదలకు ఆది నుంచీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడటం దళపతి ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది.

Read Also: Vijay Deverakonda-Rashmika: ఉదయ్‌పుర్‌ బయల్దేరిన విజయ్‌, రష్మిక 

సెన్సార్ అభ్యంతరాలు.. న్యాయపరమైన చిక్కులు

ఈ నెలలో జననాయగన్ థియేటర్లలో సందడి చేస్తుందని భావించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. తాజాగా దీని రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. న్యాయపరమైన చిక్కులు వీడితే విజయ్ పుట్టినరోజు కానుకగా జూన్ లో జననాయగన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

మొదట సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం, సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో ఆగిపోయింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకున్నా, ప్రస్తుతం సినిమా రివైజింగ్ కమిటీ వద్ద ఉండటంతో ఈ నెలలో కూడా విడుదల సాధ్యం కాదని తేలిపోయింది. దీంతో మేకర్స్ ఇప్పుడు ఒక ‘స్పెషల్ డే’ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. జూన్ 22న విజయ్ పుట్టినరోజు ఉండటంతో జూన్ 18న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Jananayagan Censor Issues Jananayagan Release Update Thalapathy Vijay Vijay Birthday Special

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.