సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) ఇద్దరూ ఒకే ప్రాజెక్ట్‌లో భాగం అవ్వడం కోలీవుడ్ చరిత్రలో అరుదైన ఘట్టం. ‘Thalaivar173’ పేరుతో ప్రకటించిన ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. రజినీ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.. అయితే ఇప్పుడు ఈ భారీ కాంబినేషన్‌పై ఊహించని షాక్ వార్త బయటకొచ్చింది.
Read Also: SS Rajamouli: పాసులు ఉంటే రండి.. లేకపోతే నో ఎంట్రీ: రాజమౌళి
వారి నుంచి నేర్చుకున్న పాఠాలు అమూల్యం
అయితే ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్‌పై వస్తున్న తాజా అప్‌డేట్ సినీ ప్రియులను షాక్‌కు గురి చేస్తోంది. ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు దర్శకుడు సుందర్ సి (Sundar C) స్వయంగా ఒక లేఖ విడుదల చేశారు.“అనుకోని పరిస్థితుల వల్ల Thalaivar173 నుండి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయం చాలా భారమైనది. రజనీకాంత్ గారిలాంటి లెజెండరీ సూపర్‌స్టార్‌తో, కమల్ హాసన్ గారి నిర్మాణంలో సినిమా చేయడం నా కల నెరవేరినట్టే.
కానీ జీవితం మనల్ని ఎప్పుడో ఒక మార్గంలో నడిపిస్తుంది. ఈ ఇద్దరు ఐకాన్లతో నా బంధం చాలా కాలం నాటిది. మా మధ్య గడిచిన ఈ కొద్ది రోజుల ప్రత్యేక క్షణాలను జీవితాంతం గుర్తుంచుకుంటాను. వారి నుంచి నేర్చుకున్న పాఠాలు అమూల్యం. ఈ అవకాశాన్ని కోల్పోతున్నా కూడా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ అప్‌డేట్‌తో అభిమానులు నిరాశ చెందితే హృదయపూర్వక క్షమాపణలు. మీకు మంచి వినోదం అందించడానికి కట్టుబడి ఉంటాను.” అని అంటూ సుందర్ సి లేఖ విడుదల చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: