📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telugu news: Telusu kadha:సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ డ్రామా ఓటీటీలోకి సిద్ధం

Author Icon By Pooja
Updated: November 9, 2025 • 11:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యూత్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’ (Telusu kadha)థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకున్న చిత్రం. దీపావళి కానుకగా అక్టోబరులో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ వేదికపై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ నెల 14వ తేదీ(Telusu kadha) నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనుంది.

Read Also:  Anu Emmanuel:ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకం

Telusu kadha

దర్శకురాలిగా నీరజ కోన తొలి ప్రయత్నం
ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఆమె తెరకెక్కించిన ఈ ముక్కోణపు ప్రేమకథకు ప్రేక్షకులు మంచి స్పందన వ్యక్తం చేశారు. థియేటర్లలో సినిమా చూడలేకపోయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రేమ, సంబంధాలు, భావోద్వేగాల మేళవింపు
సినిమా కథలో వరుణ్ (Sidhu Jonnalagadda) అనాథగా పెరిగిన వ్యక్తి. జీవితంలో తనకో సొంత కుటుంబం ఉండాలని కలలు కంటాడు. కాలేజీ సమయంలో రాగ (శ్రీనిధి శెట్టి)తో ప్రేమలో పడతాడు కానీ అనుకోని పరిస్థితుల్లో ఆమె అతని జీవితానికి దూరమవుతుంది. తరువాత వరుణ్ అంజలి (రాశీ ఖన్నా)ను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు.

ఇంతలో వారి సంతోషభరితమైన దాంపత్య జీవితంలో ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. అదే సమయంలో వరుణ్ మాజీ ప్రేమ రాగ మళ్లీ అతని జీవితంలోకి అడుగుపెడుతుంది. రాగ ఎందుకు వెళ్ళిపోయింది? తిరిగి ఎందుకు వచ్చింది? ఈ ముగ్గురి మధ్య ఏర్పడిన భావోద్వేగ సంఘర్షణ ఎటు దారి తీసింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్ర కధాంశం.

ప్రేక్షకులను కట్టిపడేసే ప్రేమకథ
సంబంధాల విలువ, గతం-ప్రస్తుతాల మధ్య దొర్లే భావోద్వేగాల్ని హృదయాన్ని తాకేలా ఈ సినిమా చూపించిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సిద్ధు, రాశీ, శ్రీనిధిల మధ్య కెమిస్ట్రీ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Latest News in Telugu OTTRelease RaashiKhanna SidduJonnalagadda Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.