📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్

Telugu news: The Raja Saab: అమెరికాలో రాజా సాబ్ మూవీ టికెట్ కు రెక్కలు

Author Icon By Tejaswini Y
Updated: December 16, 2025 • 3:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో యువ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ది రాజా సాబ్(The Raja Saab). పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో పాటు ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Read also: Pawan Kalyan: దర్శకుడు సుజిత్‌కు రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చిన పవన్

సంక్రాంతి 2026కి ప్రభాస్ బిగ్ మూవీ..

ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ(Cinematography) బాధ్యతలను కార్తీక్ పలని నిర్వహిస్తుండగా, సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తున్నారు. ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావు పనిచేస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా సుమారు 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం. నార్త్ అమెరికా హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ప్రత్యాంగీరా సినిమాస్ సొంతం చేసుకుంది. సమాచారం ప్రకారం, థియేట్రికల్ రైట్స్‌కు దాదాపు 9 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు తెలుస్తోంది. నార్త్ అమెరికా మార్కెట్‌లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారు 18 మిలియన్ డాలర్లు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అమెరికా, కెనడాలో ది రాజా సాబ్ నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్‌ను విడుదలకు దాదాపు 40 రోజుల ముందే ప్రారంభించారు. ప్రస్తుతం ప్రీమియర్ షోల కోసం మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. అలాగే తొలి వారం టికెట్ ధరల వివరాలను ప్రత్యాంగీరా సినిమాస్ అధికారికంగా ప్రకటించింది.

ది రాజా సాబ్ టికెట్ ధరల వివరాలు

టికెట్ రేట్ల ప్రకారం, జనవరి 8న ప్రదర్శించే ప్రీమియర్ షోల కోసం ఒక్క టికెట్ ధర 20 లేదా 25 డాలర్లుగా నిర్ణయించారు. జనవరి 9 నుంచి 11 వరకు జరిగే ప్రదర్శనలకు 18 లేదా 20 డాలర్లు, జనవరి 12 నుంచి 14 వరకు జరిగే షోల‌కు 14 లేదా 17 డాలర్లు టికెట్ ధరగా ఉంటాయి. జనవరి 15 నుంచి ఆపై ప్రదర్శించే షోల‌కు థియేటర్లు నిర్ణయించే సాధారణ రేట్లు అమలులోకి వస్తాయి.

స్పెషల్ ఫార్మాట్స్‌కు సంబంధించి థియేటర్ల విధానాలు, సినిమా స్థాయి ఆధారంగా అదనపు సర్‌ఛార్జీలు వర్తిస్తాయని డిస్ట్రిబ్యూటర్ స్పష్టం చేసింది. ఈ టికెట్ ధరలు కేవలం తెలుగు వెర్షన్‌కు మాత్రమే వర్తిస్తాయని కూడా తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Maruthi Director prabhas movie Sankranti Release Telugu Movies 2026 The Raja Saab

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.