📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Telugu Movies: ఓటీటీలోకి రెండు హిట్ సినిమాలు

Author Icon By Anusha
Updated: January 21, 2026 • 12:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆది సాయికుమార్ నటించిన, సినిమా ‘శంబాల’ (Shambala). గత ఏడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంది. శంబాల డిజిటల్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా (Aha) సొంతం చేసుకుంది. ఈ రోజు నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.

Read Also: Telangana: సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

అయితే ఓ ప్రత్యేక నిబంధనతో ఆహా ఈ సినిమాను రిలీజ్ చేసింది. ప్రస్తుతం శంబాల సినిమాను ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లు మాత్రమే వీక్షించే అవకాశం ఉంది. సాధారణ సబ్‌స్క్రైబర్లకు మాత్రం రేపటి నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. దీంతో గోల్డ్ యూజర్లకు ఒకరోజు ముందుగానే ఈ థ్రిల్లర్‌ను చూసే ప్రత్యేక అవకాశం లభించింది.

Telugu Movies: Two hit movies on OTT

‘ఛాంపియన్’ ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతం

యువ హీరో రోషన్ మేకా హీరోగా, మలయాళ భామ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించిన ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’ (Champion) ఓటీటీ విడుదలపై తాజా అప్‌డేట్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం, ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా జనవరి 23, 2026 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ డిజిటల్ హక్కుల డీల్ దాదాపు రూ.16 కోట్లకు కుదిరినట్లు సినీ సర్కిల్‌లో టాక్ వినిపిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aha OTT champion latest news Netflix Shambala Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.