हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Telugu Movies: సంక్రాంతికి సిద్దమవుతున్న స్టార్ హీరోల సినిమాలు

Sharanya
Telugu Movies: సంక్రాంతికి సిద్దమవుతున్న స్టార్ హీరోల సినిమాలు

ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ తెలుగు సినీ ఇండస్ట్రీకి ఒక బిగ్ సెలబ్రేషన్‌లా మారిపోతుంది. పండుగ కానుకగా ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు వెల్లడంతో నిర్మాతలు కూడా ఈ సీజన్‌ను టార్గెట్‌ చేస్తారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతికి విడుదలైతే, అవి భారీ ఓపెనింగ్స్ సాధించడంలో స్పెషల్‌గా నిలుస్తాయి. ఇప్ప‌టికే 2026 సంక్రాంతి బ‌రిలో మూడు పెద్ద సినిమాలు ఖరారు కావ‌డంతో ఇండస్ట్రీలో ఉత్సాహం నెలకొంది.

మెగా స్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కలయిక: భారీ ప్రాజెక్ట్ ‘మెగా 157’

సంక్రాంతి బరిలో ముందుగా నిలిచిన చిత్రం మెగాస్టార్ చిరంజీవి, ఎనర్జిటిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మెగా 157’. ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండ‌గా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఈ మూవీ షూటింగ్‌ను ఈ ఏడాదిలోనే పూర్తి చేసి, 2026 సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

నవీన్ పొలిశెట్టి – వినోదానికి రాచబట్టిన ‘అనగనగా ఒక రాజు’

యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఎంతగా అలరిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంక్రాంతి బ‌రిలో ఉన్న రెండో సినిమా న‌వీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో నవీన్ పొలిశెట్టి స‌ర‌స‌న‌ మీనాక్షి చౌదరి క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇటీవ‌లే మూవీని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14 విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మారి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

మాస్ మహారాజా రవితేజ ‘అనార్కలి’: వినూత్న టైటిల్‌తో భారీ ప్రాజెక్ట్

కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన చేస్తున్న 76వ సినిమా ప్రస్తుతం ‘అనార్కలి’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా పుజా కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ‘ర‌వితేజ 76’ ప్రాజెక్ట్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు ప్రస్తుతం ‘అనార్కలి’ అనే వర్కింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. రవితేజ మార్క్ మాస్ ఎంటర్‌టైనర్ అంశాలతో పాటు, ఈ టైటిల్ కాస్త భిన్నంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. రవితేజ తనదైన ఎనర్జిటిక్ నటనతో ఆకట్టుకుంటూనే, ఈ చిత్రంతో ఒక కొత్తదనంతో కూడిన కథను ప్రేక్షకులకు అందించనున్నారని తెలుస్తోంది.

త్రిముఖ పోటీ – బాక్సాఫీస్ వద్ద గట్టి ఢీ

ఈ మూడు సినిమాలు – మెగా, మాస్, హాస్యంతో కూడిన చిత్రాలు – సంక్రాంతి 2026న ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ అనివార్యం. దీంతో ఈసారి త్రిముఖ పోటీ ఉండ‌నుంది. ఇంకా ఆరు నెల‌ల స‌మ‌యంలో ఉండ‌డంతో మ‌రిన్ని చిత్రాలు సంక్రాంతి బెర్త్ కోసం పోటీ ప‌డే అవ‌కాశం ఉంది. గ‌తేడాది కూడా ఇలాగే మూడు సినిమాలు (గేమ్ ఛేంజ‌ర్‌, డాకు మ‌హారాజ్, సంక్రాంతికి వ‌స్తున్నాం) ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన విష‌యం తెలిసిందే.

Read also: Kamal Haasan: కమల్ వ్యాఖ్యతో రాజ్యసభ నామినేషన్ వాయిదా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870