📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Telugu Film Chamber: ప్రారంభమైన ఎన్నికల పోలింగ్

Author Icon By Anusha
Updated: December 28, 2025 • 10:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్) 2025–27 (Telugu Film Chamber) కార్యవర్గ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఛాంబర్ కార్యాలయం (Telugu Film Chamber) లో ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలవగా, మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగనుంది.ఈ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, దిల్ రాజు నేతృత్వంలోని ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’, మరోవైపు సి. కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

Read Also: Etv Win: కొత్త యూజర్లకు ఈటీవీ విన్ భారీ ఆఫర్

పరిశ్రమ సొమ్మును బడా నిర్మాతలు దోచుకుంటున్నారని ఆరోపణలు

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఎన్నికలు ఈ రోజు జరగబోతున్నాయి. చిన్న నిర్మాతలంతా మన ప్యానెల్ పేరుతో, పెద్ద నిర్మాతలంతా ప్రొగ్రెసివ్ ప్యానల్ పేరుతో పోటీపడుతున్నారు. గిల్డ్ పేరుతో కోట్లాది రూపాయల పరిశ్రమ సొమ్మును బడా నిర్మాతలు దోచుకుంటున్నారని చిన్న నిర్మాతలు ఆరోపిస్తుండగా…. ఈ ఎన్నికలు పదవుల కోసం కాదు అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమని ప్రొగ్రెసివ్ ప్యానల్ లో ఉన్న అగ్ర నిర్మాతలు వాదిస్తున్నారు.

దీంతో మరోసారి ఛాంబర్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.ఈ ఎన్నికల్లో మొత్తం 3,355 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో నిర్మాతల విభాగం నుంచి 1,703 మంది, డిస్ట్రిబ్యూటర్ల విభాగం నుంచి 631 మంది, ఎగ్జిబిటర్ల విభాగం నుంచి 916 మంది, స్టూడియో సెక్టార్ నుంచి 105 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా నాలుగు సెక్టార్లకు ఛైర్మన్‌లను, 44 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం ఎన్నికైన సభ్యులు ఛాంబర్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

Telugu Film Chamber: Election polling begins

కమిటీ పదవీకాలం జులై 2025లోనే ముగిసింది

నిబంధనల ప్రకారం, ఈసారి అధ్యక్ష పదవి ఎగ్జిబిటర్ల సెక్టార్‌కు కేటాయించబడింది. దీంతో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తరఫున డి. సురేష్ బాబు, మన ప్యానెల్ మద్దతుతో నట్టి కుమార్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. గత కమిటీ పదవీకాలం జులై 2025లోనే ముగియగా, ఆరు నెలల ఆలస్యంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సి. కళ్యాణ్ వంటి సీనియర్ నిర్మాతలు గట్టిగా డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుత పోలింగ్ ప్రక్రియకు మార్గం సుగమమైంది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించి, సాయంత్రానికల్లా ఫలితాలను వెల్లడించనున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టే కార్యవర్గం ఎవరనే దానిపై పరిశ్రమలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Hyderabad Film Nagar latest news Telugu Film Chamber of Commerce Telugu News TFCC elections tollywood

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.