📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్

Author Icon By Aanusha
Updated: February 12, 2026 • 8:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి, నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్ చాట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్టీఆర్ జాతీయ నాయకుడు. ఎన్టీఆర్ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే వారంత మూర్ఖులు ఎవరు ఉండరు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ’ అని అన్నారు.

Read Also: Actor Naresh: ‘హే భగవాన్’ ఈవెంట్‌లో నరేష్ ఫన్నీ కామెంట్స్

అసెంబ్లీ వేదికగా అన్ని ఆధారాలతో మాట్లాడతా

సింగరేణి సంస్థ అప్పుల ఊబిలో ఉందన్న విమర్శలపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. సింగరేణి టెండర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం 2018లోనే మార్పులు చేసిందని ఆయన గుర్తు చేశారు. సింగరేణిలో జరుగుతున్న టెండర్ల వ్యాపారం, అక్రమాలపై తాను అసెంబ్లీ వేదికగా అన్ని ఆధారాలతో మాట్లాడతానని స్పష్టం చేశారు. సింగరేణి మేం అధికారంలోకి రాకముందు నుంచే అప్పుల్లో ఉందని, జెన్కోకి బొగ్గు సరఫరా చేసిన బకాయిలు పేరుకుపోయాయని వివరించారు.

Telangana: NTR should be given Bharat Ratna: CM Revanth

కోల్ ఇండియా కూడా అప్పుల ఊబిలో ఉందని, తాను అమాయకుడిని కాబట్టి తన మీద నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “నేను ప్రూఫ్ చేస్తే కిషన్ రెడ్డి క్షమాపణ చెప్తారా?” అని ప్రశ్నించిన సీఎం, గతంలో KCR ను, ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. కెసిఆర్ ప్రస్తుతం సెల్ఫ్ హౌస్ అరెస్ట్ అయ్యారని ఎద్దేవా చేశారు.హైదరాబాద్ ను, బుల్లెట్ ట్రైన్ హబ్ మారుస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన 600 ఎకరాల భూమిని సేకరించి బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను, కోరినట్లు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Bharat Ratna latest news NTR Revanth Reddy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.