📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Telangana: డ్రగ్స్ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన నటి రకుల్ సోదరుడు

Author Icon By Anusha
Updated: January 7, 2026 • 10:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన డ్రగ్స్ కేసును కొట్టివేయాలని ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ (Telangana) హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్ ముఠాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.గత నెల 19న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ సమీపంలో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి.

Read also: AP Bus Accident: ట్రావెల్స్ బస్సులో మంటలు

Telangana: Drugs case.. Actress Rakul’s brother approaches High Court

ఈ నెల 9వ తేదీకి వాయిదా

పోలీసుల దర్యాప్తులో నిందితుల సెల్‌ఫోన్లను విశ్లేషించగా.. అమన్ ప్రీత్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపించింది. అమన్ కేవలం డ్రగ్స్ వినియోగదారుడు మాత్రమే కాదని అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. గత నెల రోజుల్లోనే ఆయన సుమారు ఆరుసార్లు నిందితుల వద్ద నుండి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు డిజిటల్ ఆధారాల ద్వారా నిర్ధారణకు వచ్చారు. దీంతో ఈ కేసులో అమన్‌ను ఏ7గా చేర్చి, ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పోలీసుల గాలింపు నేపథ్యంలో అమన్ ప్రీత్ సింగ్ ముందస్తు జాగ్రత్తగా హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులో ఆధారాలు లేవని, చట్టబద్ధంగా ఆ ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని కోరారు. అయితే ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ పిటిషన్‌పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Aman Preet Singh Drugs Case latest news Masab Tank Police Station Rakul Preet Singh Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.