📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest news: Telangana cm: తన పెళ్లికి రావాలంటూ రేవంత్ రెడ్డిని కోరిన నారా రోహిత్

Author Icon By Saritha
Updated: October 24, 2025 • 3:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నటి శిరీషతో వివాహ బంధంలోకి టాలీవుడ్ హీరో నారా రోహిత్

టాలీవుడ్ నటుడు నారా రోహిత్(Nara Rohit) జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఆయన నటి శిరీష లేళ్లతో అక్టోబర్ 30న వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ వేడుక హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా నాలుగు రోజుల పాటు జరగనుంది. పెళ్లి ఏర్పాట్లతో బిజీగా ఉన్న రోహిత్ ఇటీవల తెలంగాణ(Telangana cm) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వివాహానికి ఆహ్వానించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నారా కుటుంబం పెళ్లి వేడుకలను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 25న హల్దీ, 26న వధూవరుల కార్యక్రమం, 28న మెహందీ వేడుకలు జరుగుతాయి. అక్టోబర్ 30న రాత్రి 10:35 గంటలకు శుభముహూర్తంలో నారా రోహిత్, శిరీషల వివాహం జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు.

Read also: ఎట్టకేలకు రేవంత్ రెడ్డికి క్షమాపణన చెప్పిన కొండా సురేఖ !

Telangana cm: తన పెళ్లికి రావాలంటూ రేవంత్ రెడ్డిని కోరిన నారా రోహిత్

సినిమా సెట్స్‌లో మొదలైన ప్రేమ కథ

‘ప్రతినిధి–2’ సినిమా షూటింగ్ సమయంలో రోహిత్, శిరీష మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది. ఇరువురి కుటుంబాల అంగీకారంతో గత ఏడాది అక్టోబర్ 13న హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో నిశ్చితార్థం జరిగింది. ఆ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అయితే, కొద్ది కాలానికే రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మరణించడంతో పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ పెళ్లి తేదీ ఖరారవడంతో నారా కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. ప్రస్తుతం రోహిత్ రాజకీయ, సినీ ప్రముఖులను (Telangana cm) కలుసుకుంటూ వివాహానికి ఆహ్వానిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

CelebrityMarriage ChandrababuNaidu Latest News in Telugu NaraFamily NaraRohith Prathinidhi2 RevanthReddy ShireeshaLella Telugu News TeluguCinema

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.