📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Tarun Bhaskar: ‘గాయపడ్డ సింహం’ ట్రైజర్ లో హైలైట్స్ ఇవే!

Author Icon By Anusha
Updated: February 9, 2026 • 4:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Tarun Bhaskar: These are the highlights of the ‘Gaaya Padda Simham’ trailer!

టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’. ఈ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, ఫరియా అబ్దుల్లా ,మానస చౌదరి కథానాయికలుగా నటించారు. దర్శకుడు పవన్ సాధినేని ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడం ప్రత్యేకతగా మారింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ కలిపిన ప్రత్యేక వీడియోను ‘ట్రైజర్’ పేరుతో తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైజర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. కామెడీ, వెటకారం, యాక్షన్ అంశాలను మేళవిస్తూ సరదాగా సాగే కథనంతో పాటు ఓ అంతర్గత సందేశాన్ని చెప్పేలా ఈ ట్రైజర్ రూపొందించడం విశేషం.

Read Also: Movie: మనసంతా నువ్వే రీ-రిలీజ్‌పై ఉదయ్ కిరణ్ మేనల్లుడు తేజ స్పందన

కథ

అమెరికా వెళ్లాలని కలలు కనే ఓ యువకుడి జీవితంలో చోటుచేసుకునే సంఘటనల చుట్టూ సినిమా తిరుగుతుంది. వీసా రిజెక్ట్ కావడంతో అతడు ఎదుర్కొనే నిరాశ, ఫ్రస్ట్రేషన్, ఆ తర్వాత తీసుకునే నిర్ణయాలు కథకు ప్రధానాంశాలుగా ఉంటాయని ట్రైజర్ ద్వారా అర్థమవుతోంది. మధ్య మధ్యలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్‌లు, కేజీఎఫ్ స్పూఫ్ సన్నివేశాలు, అమెరికా వెళ్లకపోయినా హీరో ఇచ్చే బిల్డప్ డైలాగులు వినోదాన్ని పంచుతున్నాయి.

ప్రత్యేకంగా ట్రైజర్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సూచించే విధంగా చూపించిన సన్నివేశాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అమెరికా వీసా నిబంధనల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువత ఆవేదనను ప్రతిబింబించే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తోంది. “Don’t Laugh… It’s a Serious Matter” అనే క్యాప్షన్ ద్వారా చిత్ర బృందం కథలో ఉన్న అంతర్గత భావాన్ని స్పష్టంగా చెప్పింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Gayapadda Simham movie latest news Tarun Bhaskar Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.