డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో మరోసారి నటుడిగా కనిపించనుండటం విశేషం. ఆయనకు జోడీగా ఈషా రెబ్బా నటించగా, ఈ సినిమాతో ఏఆర్ సంజీవ్ అనే కొత్త దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 30న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Read Also: Chiranjeevi: ‘శశిరేఖ’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
ట్రైలర్ లో హైలైట్స్
ప్రమోషన్స్‌లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ అందజేశారు.తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బా పెళ్లి చూపుల సన్నివేశంతో ప్రారంభమైన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైలర్ ఆద్యంతం అలరిస్తోంది.
కోపిష్టి అయిన తరుణ్ భాస్కర్.. పెళ్లి తర్వాత భార్యను ప్రతీ చిన్న విషయానికి కొడుతూ ఉంటాడు. సహనంతో అన్నీ భరిస్తూ వచ్చిన ఈషా.. ఓపిక నశించి భర్తపై తిరగబడుతుంది. దీంతో భార్యపై ప్రతీకారం తీర్చుకోడానికి తరుణ్ చేసే ప్రయత్నాలను ఈ ట్రైలర్ లో చూపించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: