📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

100 కోట్ల మార్క్‌ వైపు తండేల్ ప‌రుగు

Author Icon By Sharanya
Updated: February 15, 2025 • 4:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ సినిమా విడుదలైన తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఫిబ్రవరి 7న భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, విభిన్నమైన కథతో ప్రేక్షకుల మనసును దోచుకుంది.

రెండు రోజుల్లోనే 41 కోట్ల వసూళ్లు:
సినిమా విడుదలైన తొలి రెండు రోజుల్లోనే రూ. 41 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు నమోదు చేసింది. స్టోరీ, విజువల్స్, నటన అన్నీ కలిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
8 రోజుల్లోనే రూ. 95.20 కోట్లు :
తాజా అప్‌డేట్ ప్రకారం, సినిమా విడుదలైన 8 రోజుల్లోనే రూ. 95.20 కోట్ల వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ వీకెండ్‌లోనే 100 కోట్ల క్లబ్‌లోకి చేరనుంది.

గీతా ఆర్ట్స్:
ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ (DSP) అందించిన సంగీతం, సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. చైతన్య, సాయి పల్లవి డీ-గ్లామర్ లుక్‌లో కనిపించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. నటీనటుల శ్రమ స్పష్టంగా కనిపించేలా సినిమా తెరకెక్కింది. ఈ సినిమా షూటింగ్ 30 రోజులపాటు ఎండలో, వానలో, సముద్రంలో నిరంతరం కష్టపడి చేయాల్సి వచ్చింది. సముద్ర సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయని ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఈ సినిమా రూ. 90 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారని సమాచారం. నాగచైతన్య కెరీర్‌లో ఇదే అత్యంత ఖరీదైన సినిమా.

100 కోట్ల క్లబ్‌లోకి తండేల్:
సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. ఈ వారాంతానికి రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బుజ్జితల్లి, రాజుగా సాయి పల్లవి, చైతూ త‌మ‌ పాత్ర‌ల్లో జీవించారు. దాంతో ఈ పాత్ర‌లు ప్రేక్ష‌కుల‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక పాకిస్థాన్ ఎపిసోడ్ సినిమాలో చాలా కీలకం. అయినా ఎమోషన్ అంతా రాజు, బుజ్జితల్లిల మధ్యే నడుస్తుంది. మూవీ ప్రారంభం నుంచి ఎండ్‌ కార్డ్ పడేవరకూ త‌మ‌ ప్రేమతో నింపేశారు. ఈ వారం వీకెంట్ పూర్తయ్యేనాటికి తండేల్ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరుకుంటుందని సమాచారం.

#100CroreClub #blockbusterhit #dsp #Nagachaitanya #SaiPallavi #thandelblockbuster Breaking News in Telugu GeethaArts Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.