📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Supreme Court: నటి ప్రత్యూష మృతి కేసులో నేడే తుది తీర్పు

Author Icon By Aanusha
Updated: February 17, 2026 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Supreme Court: హీరోయిన్ ప్రత్యూష హత్య కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం మంగళవారం తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. 2002లో ఈ హత్య జరగగా సుదీర్ఘకాలం పాటు ఈ కేసును విచారించిన సిబిఐ, ఈ కేసులో చార్జీ షీట్ దాఖలు చేసింది. ఇందులో ప్రత్యూష స్నేహితుడు సిద్ధార్థ రెడ్డిని సీబీఐ నిందితుడిగా పేర్కొంది. దీంతో కేసుపై విచారణ జరిపిన నాంపల్లి స్టేషన్ కోర్టు సిద్ధార్థ రెడ్డికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

Read Also: Tamil Nadu: హీరోయిన్ త్రిషకు బీజేపీ నేత నాగేంద్రన్ క్షమాపణలు

తుది తీర్పు

అయితే ప్రత్యూష కుటుంబం మాత్రం ఈ నేరానికి కేవలం ఏడేళ్ల జైలు శిక్ష సరిపోదు అంటూ హైకోర్టును ఆశ్రయించింది.ప్రత్యూషను క్రూరంగా అత్యాచారం చేసి హత్య చేశారని ఆమె తల్లి ఆరోపించింది. ఈ నేరానికి జీవితకాల శిక్ష విధించాలని 2006లో హైకోర్టును ఆశ్రయించింది. 2011 వరకు ఐదేళ్ల పాటు ఈ కేసును విచారించిన హైకోర్టు సిద్ధార్థ రెడ్డికి వ్యక్తిరేకంగా బలమైన సాక్షాధరాలు లేవని జైలు శిక్షను రెండున్నర ఏళ్లకు తగ్గించింది.దీంతో 2011లో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రత్యూష కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Supreme Court: Final verdict in actress Pratyusha death case today

ఈ కేసును పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు దీనిపై విచారణ జరపడం ప్రారంభించింది. అప్పటి నుంచి సుమారు14 ఏళ్లపాటు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న సిద్ధార్థ రెడ్డికి శిక్ష పెంచుతారా? లేదా హైకోర్టు జడ్జిమెంట్‌తో ఏకీభవించి అతని శిక్షణు తగ్గిస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Pratyusha murder case Supreme Court Telugu heroine Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.