📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Super Man OTT: సూపర్‌మ్యాన్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

Author Icon By Anusha
Updated: August 13, 2025 • 2:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డీసీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన సూపర్‌మ్యాన్‌ (2025) (Superman), చిత్రం ఈ ఏడాది హాలీవుడ్‌లో జూలై 11న భారీ అంచనాల మధ్య విడుదలై, ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంది. జేమ్స్ గన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, డీసీ సినిమాటిక్ యూనివర్స్‌లో కొత్త యుగానికి నాంది పలికిందని సినీ విమర్శకులు భావిస్తున్నారు. సూపర్‌హీరో సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం ఓ కొత్త అనుభూతిని అందించింది.చిత్రంలో యాక్షన్, భావోద్వేగాలు, విజువల్స్, సూపర్‌మ్యాన్‌ పాత్రలో నటుడి ప్రదర్శన అన్నీ ఈ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. డీసీ అభిమానులు (DC fans) మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను థియేటర్లలో చూసి మంత్రముగ్ధులయ్యారు. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించి, జూలై నెలలోనే హాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ నుంచి ప్ర‌ముఖ ఓటీటీ వేదిక‌లైన‌ అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, ఫాండాంగో ఎట్ హోమ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు జేమ్స్ గ‌న్ వెల్ల‌డించారు.

క‌థ 

సూపర్‌మ్యాన్ (డేవిడ్ కోరెన్స్‌వెట్‌) తన సొంత గ్రహం అయిన‌ క్రిప్టాన్‌ను అలాగే త‌న కుటుంబాన్ని కాపాడుకోలేకపోయాను అన్న‌ పశ్చాత్తాపంతో బాధపడుతుంటాడు. దీంతో భూమి మీద‌కి వ‌చ్చి ఒక కుటుంబానికి ద‌గ్గ‌రై వారితో త‌న తన అస్తిత్వాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు.మరోవైపు, పారిశ్రామికవేత్త అయిన‌ లెక్స్ లూథర్ (నికలస్ హోల్ట్‌), సూపర్‌మ్యాన్ వ‌ల‌న‌ భూమికి ముప్పు అని భావించి, అతన్ని అంతం చేయాలని కుట్ర పన్నుతాడు. హ్యామర్‌ ఆఫ్ బోరేవియా అనే ప‌వ‌ర్‌ఫుల్‌ ఆయుధాన్ని సృష్టించి, ప్రజల్లో సూపర్‌మ్యాన్‌పై ద్వేషాన్ని పెంచుతాడు. ఈ పరిస్థితులలో, సూపర్‌మ్యాన్ తన విశ్వసనీయతను ఎలా నిరూపించుకున్నాడు? లెక్స్ లూథర్ చర్యలను ఎలా అడ్డుకున్నాడు? ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? అతని ప్రేమికురాలు లొయిస్ లేన్ (రెచెల్) ఇతర సూపర్ హీరోస్ అతనికి ఎలా సహాయం చేశారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

‘సూపర్‌మ్యాన్‌’ (2025) సినిమా ఎప్పుడు విడుదలైంది?

ఈ చిత్రం హాలీవుడ్‌లో జులై 11, 2025న విడుదలైంది.

ఈ సినిమా దర్శకుడు ఎవరు?

‘సూపర్‌మ్యాన్‌’ (2025) చిత్రాన్ని జేమ్స్ గన్ దర్శకత్వం వహించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/rashmika-mandanna-they-are-paying-me-to-troll-me-rashmika/cinema/529858/

Amazon Prime Video Apple TV DC Universe Fandango at Home Hollywood blockbuster James Gunn OTT Release streaming release Superman 2025 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.