టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) తన కెరీర్‌లో మరో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రతి సినిమాలో కొత్తగా ప్రయోగాలు చేస్తూ, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సందీప్, ఈ సారి మాత్రం పవర్‌ఫుల్ యాక్షన్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు ‘సిగ్మా (SIGMA)’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ, చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేసింది.
Read also: Sunita Ahuja: బాబోయ్.. మరో జన్మ ఉంటే భర్తగా గోవిందా వద్దు
అయితే ఈ సినిమాతోనే తమిళ స్టార్ విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, తాజాగా చిత్ర బృందం టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. సినిమా టైటిల్‌ను ‘సిగ్మా (SIGMA)’ గా ఫిక్స్ చేశారు. విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సందీప్ కిషన్ (Sundeep Kishan)బంగారం, నగదు కట్టలపై చేతికి కట్టు కట్టుకుని సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు.
ఆయన కళ్లల్లో కనిపిస్తున్న యాంగర్, ఇంటెన్సిటీ ఈ మూవీ టోన్‌ను స్పష్టంగా చెబుతోంది.తమిళ స్టార్ దళపతి విజయ్ (Thalapati Vijay) కుమారుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తుండటం మరింత స్పెషల్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్, విజువల్స్ విషయంలో ఆయన చూపుతున్నప్రత్యేక దృష్టి సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్
తొలి సినిమానే పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేయడం ద్వారా ఆయన సీరియస్ ఫిల్మ్‌మేకర్‌గా కనిపిస్తున్నారు. ‘మైఖేల్’, ‘టెనెట్’ తరహాలో ఆ యాక్షన్-ఇంటెన్స్ జానర్‌లో సిగ్మా సినిమా సందీప్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవబోతుందని ట్రేడ్ సర్కిల్స్ అభిప్రాయం. “When Greed Meets Guts!” అనే ట్యాగ్‌లైన్ పోస్టర్‌లో కనిపించడం సినిమాపై ఆసక్తి మరింత పెంచింది.
సందీప్ కిషన్ – జాసన్ సంజయ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘సిగ్మా’ త్వరలోనే థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. ట్రెజర్ హంట్, హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్ కలగలిపిన ఈ మూవీ 2025లో టాలీవుడ్‌లో బిగ్ బ్లాస్టర్ అవ్వడం ఖాయం అని సినీ వర్గాలు చెబుతున్నాయి!
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: