📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Sundarakanda Movie – నారా రోహిత్ సుందరకాండ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? పూర్తి వివరాలు?

Author Icon By Anusha
Updated: September 19, 2025 • 9:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యువ నటుడు నారా రోహిత్‌ (Nara Rohit) ప్రధాన పాత్రలో రూపొందిన, చిత్రం ‘సుందరకాండ’ ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమాల్లో ఒకటి. ఈ చిత్రానికి వెంకటేశ్‌ నిమ్మలపూడి దర్శకత్వం వహించారు. 90వ దశకంలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న అలనాటి నటి శ్రీదేవి విజయ్‌కుమార్ (Sridevi Vijaykumar) ఇందులో కీలక పాత్ర పోషిస్తుండగా,

యువ హీరోయిన్ వ్రితి వాఘని ప్రధాన నాయికగా నటించింది. కథ విషయానికి వస్తే – వివాహం వయసులోకి వచ్చిన ఒక యువకుడు ఎదుర్కొనే సమస్యలు, పెళ్లి ప్రక్రియలో వచ్చే సరదా, ఒత్తిళ్లు, సంఘటనలు ఎలా ఉంటాయో వినోదాత్మక శైలిలో చూపించారు. కుటుంబ ప్రేక్షకులే లక్ష్యంగా ఈ సినిమా తెరకెక్కింది.

సిట్యుయేషన్లకు తగ్గ హాస్య సన్నివేశాలు

వినాయక చవితి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. నారా రోహిత్ నటన, హాస్యాన్ని మిళితం చేసిన కథనం, శ్రీదేవి విజయ్‌కుమార్, వ్రితి వాఘని పాత్రలతో పాటు మిగతా తారాగణం కూడా ఆకట్టుకున్నారు. పాటలు, నేపథ్య సంగీతం, సిట్యుయేషన్లకు తగ్గ హాస్య సన్నివేశాలు – అన్నీ కలసి సండే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచాయి.

రోహిత్ కెరీర్‌లోనూ ఇది వేరే కోణాన్ని చూపించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడూ ఈ చిత్రం తాజాగా ఓటీటీని లాక్ చేసుకుంది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar) లో ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 23 నుంచి తెలుగు, త‌మిళంతో పాటు మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

Sundarakanda Movie

ఐదు లక్షణాల గురించి పెట్టుకున్న కొన్ని రూల్స్

ఈ సినిమా క‌థ విష‌యానికి వస్తే.. సిద్ధార్థ్ (నారా రోహిత్) వయసు ముప్ఫై దాటింది అయిన కూడా పెళ్లి కాని ప్ర‌సాద్‌లా మిగిలిపోతాడు. సిద్ధార్థ్ పెళ్లి కాకపోవడానికి కారణం, తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో ఉండాల్సిన ఐదు లక్షణాల గురించి పెట్టుకున్న కొన్ని రూల్స్. తనకు వచ్చిన ప్రతి పెళ్లి సంబంధాన్ని ఈ రూల్స్ సాకుతోనే చెడగొడుతుంటాడు. నిజానికి ఈ ఐదు లక్షణాలకు కారణం తన స్కూల్ సీనియర్ అయిన వైష్ణవి (శ్రీదేవి విజయ్ కుమార్).

వాళ్ళిద్దరి ప్రేమ కథ మధ్యలో ఎవరి వల్ల బ్రేక్ పడింది అనేదే ఒక కథ. ఇక, ఎయిర్ పోర్టు (Airport) లో పరిచయం అయిన ఐరా (వృతి వాఘాని)లో తను కోరుకున్న ఆ ఐదు లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఆ అమ్మాయి ఇంకా చదువుకుంటోంది. అమెరికా వెళ్ళబోతున్న ఐరా కోసం, సిద్ధార్థ్ ఒక కాలేజీలో లెక్చరర్ గా చేరతాడు. తర్వాత సిద్ధార్థ్ ను ఐరా ప్రేమిస్తుంది.

ఐరా కథలు ఎలా కలిశాయి?

వాళ్ళిద్దరి పెళ్లికి వయసులో ఉన్న వ్యత్యాసం కాకుండా మరో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే రెండో కథ. అయితే ఈ వైష్ణవి, ఐరా కథలు ఎలా కలిశాయి? సిద్ధూ పెళ్లికి వచ్చిన అడ్డంకులు ఏమిటి? సిద్ధార్థ్ తల్లిదండ్రులు (నరేష్, రూప లక్ష్మి), అక్క (వాసుకి) ఇంకా స్నేహితులు (సత్య, సునైనా, అభినవ్ గోమఠం) అతనికి ఎలా సహాయం చేశారు? చివరకు సిద్ధార్థ్ కు పెళ్లి అవుతుందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ya-ali-singer-zubin-garg-passes-away/cinema/actor/550558/

Breaking News Jio Hotstar Telugu movies latest news Nara Rohith Sundarakanda Movie Sundarakanda OTT release Sundarakanda streaming date Sundarakanda Tamil Malayalam Kannada Hindi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.