📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Sumathi Valavu Movie: సుమతి వలవు (జీ 5) మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: September 26, 2025 • 5:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చాలా తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన సినిమాలు మలయాళ సినీ పరిశ్రమ (Malayalam film industry) లో సర్వసాధారణం. కానీ, కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు box officeలో భారీ వసూళ్లను రాబట్టడం కూడా ప్రత్యేకంగా గుర్తింపు పొందుతాయి. అలాంటి సినిమా ఇదే ‘సుమతి వలవు’. హారర్-కామెడీ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను భయభ్రాంతులతో పాటుగా నవ్వులు తెప్పించడంలో విజయం సాధించింది.ఈ సినిమా, ఈ రోజు నుంచి ‘జీ 5’ (Zee 5) లో మలయాళంతో పాటు, తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లోను స్ట్రీమింగ్ అవుతోంది.మరి ఈ సినిమా ఎలా ఉందొ రివ్యూ లో చూద్దాం.

Allu Arjun: బన్నీ వల్లే డ్యాన్స్ క్వీన్ అయ్యా: స్టార్ హీరోయిన్

‘సుమతి వలవు’ సినిమాకు అర్జున్ అశోకన్, మాళవిక మనోజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ రెండుగురు నటీనటులు వారి నటనతోనే ప్రేక్షకులను కట్టిపడేశారనే చెప్పాలి. చిన్న బడ్జెట్ తో రూపొందిన్నప్పటికీ, కథా నిర్మాణం, విజువల్స్, సంగీతం, సెట్ డిజైన్ అన్నీ ప్రేక్షకులకు ఒక వింత అనుభూతిని ఇచ్చేలా రూపొందించబడ్డాయి. ఇది ఒక సరికొత్త హారర్-కామెడీగా, మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును సాధించింది. 

కథేంటంటే

అది అడవిని ఆనుకుని ఉన్న ‘కల్లేలి’ అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి మూడు వైపులా ఫారెస్ట్ ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాస్త దూరం ముందుకు వెళితే ఒక టర్నింగ్ వస్తుంది. దానినే ‘సుమతి వలవు’ (Sumathi Valavu Movie)అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. చాలా కాలం క్రితం చనిపోయిన ‘సుమతి’ అనే యువతి అక్కడ దెయ్యమై తిరుగుతుందని ఆ గ్రామస్తులంతా భావిస్తూ ఉంటారు. బ్రిటిష్ వారి కాలంలో అక్కడ ఏర్పాటు చేసిన స్థావరాన్ని, ఆ దెయ్యం భయంతో ఖాళీ చేశారనే ఒక మాట ప్రచారంలో ఉంటుంది. 

సుమతి అనే ఆ దెయ్యం భయం కారణంగా, రాత్రి 8 గంటల దాటిన తరువాత ఎవరూ కూడా ఇల్లు దాటరు. ఆ సమయం దాటిన తరువాత అటుగా ఎవరూ వెళ్లకుండా ఒక ‘చెక్ పోస్టు’ను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ ఊరుకి చెందిన శేఖరన్ (Sekaran) పెద్దకూతురు ‘మాలు’ తనకి నచ్చిన వ్యక్తితో పారిపోతుంది. అయితే ఆ సమయంలో ఆమెను దెయ్యం చంపేసి ఉంటుందనే ఒక అనుమానం కూడా అక్కడివారిలో ఉంటుంది. 

Sumathi Valavu Movie

కథనం

‘మాలు’ పారిపోవడానికి సహాయపడింది ‘అప్పూ’ అనే డౌట్ శేఖరన్ ఫ్యామిలీకి ఉంటుంది. అప్పటి నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం కొనసాగుతూ ఉంటుంది. అయితే శేఖరన్ రెండో కూతురు ‘భామ'(మాళవిక మనోజ్), అప్పూను ప్రేమిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సుమతి కథను కొట్టిపారేస్తూ ఆ ఏరియాకి కొత్తగా ఎస్ ఐ బెంజిమన్ వస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? సుమతి ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? భామతో అప్పూ పెళ్లి జరుగుతుందా? అనేది కథ. 

‘సుమతి వలవు’ .. అంటే ‘సుమతి మలుపు’ అని అర్థం. చాలా ప్రాంతాలలో .. రహదారులలో .. ఒకే ప్రదేశంలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఒకే ప్లేస్ లో చాలామంది ప్రాణాలను కోల్పోతూ ఉంటారు. దాంతో అక్కడ ఏదో ఉంది అనే ప్రచారం జరుగుతూ ఉంటుంది. అలా కేరళలోని ‘తిరువనంతపురం’ పరిథిలో ఇదే పేరుతో ఒక రోడ్డు మలుపు ఉంది. అక్కడ వినిపించే కథను ఆధారంగా చేసుకుని నిర్మించిన సినిమా ఇది.

విశ్లేషణ

సుమతి దెయ్యంగా మారిన కథ .. ‘మాలు’ అనే యువతి ప్రేమించినవాడితో రాత్రివేళలో ఆ మలుపు దాటుకుని వెళ్లిన కథ .. ప్రస్తుతం ఆ విలేజ్ (Village) లో నడిచే అప్పూ ప్రేమకథ. ఇలా ఈ మూడు  కథలను కలుపుకుంటూ ఈ సినిమా కొనసాగుతుంది. ఒక వైపున హారర్ .. ఒక వైపున లవ్ .. మరొక వైపున సస్పెన్స్ తో ఈ కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. ప్రధానమైన పాత్రలను .. సన్నివేశాలను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది.

విలేజ్ లో ఉండే పాత్రలు విలేజ్ లో ఉండగా, కొత్త ఫారెస్ట్ ఆఫీసర్ గా హరి .. పోలీస్ ఆఫీసర్ గా బెంజిమన్ .. ఆర్మీ ఆఫీసర్ గా మహేశ్ ఒకరి తరువాత ఒకరుగా ఆ విలేజ్ లోకి ఎంటర్ కావడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఒక వైపున ఫారెస్టు ఏరియా .. మరో వైపున సుమతి మలుపు .. చెక్ పోస్టు .. విలేజ్ కి సంబంధించిన నైట్ ఎఫక్ట్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. చివరివరకూ మనలో ఆసక్తి ఎంతమాత్రం తగ్గకుండా చేస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

arjun ashokan Box Office Success Breaking News Horror comedy latest news low budget hit Malavika Manoj Malayalam Cinema OTT Release Sumathi Valavu Telugu News ZEE5 streaming

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.