Suhas Movie Title Change: టాలీవుడ్లో ఇటీవల సెన్సార్ సమస్యలు నిర్మాతలు, దర్శకులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. సినిమాల కంటెంట్‌తో పాటు టైటిల్స్ విషయంలో కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కఠినంగా వ్యవహరిస్తుండటంతో విడుదల సమయాల్లో అనిశ్చితి నెలకొంటోంది. కొద్దిరోజుల క్రితమే కపుల్ ఫ్రెండ్లీ, వానర సినిమాల టైటిల్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు, పేర్లు మార్చాలని సూచించడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. తాజాగా సుహాస్ నటించిన ‘హే భగవాన్’ సినిమాకు విడుదలకు ముందు టైటిల్ మార్చాలని CBFC ఆదేశించింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా పేరును ‘హే బల్వంత్’గా మార్చి పోస్టర్‌ను విడుదల చేశారు.
Read Also: Tamil Nadu: బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై త్రిష ఆగ్రహం
ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు
కేవలం నాలుగు రోజుల ముందే ఇలా టైటిల్ మారడం సినిమా ప్రమోషన్లపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ మూవీ మేకర్స్ U/Aసర్టిఫికెట్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు షాక్ అవుతున్నారు. కాగా.. గోపి అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వీకే సరేష్, యాంకర్ స్రవంతి, అన్నపూర్ణమ్మ కీలక పాత్రల్లో నటించారు. తండ్రీకొడుకుల మధ్య సాగే ఒక విభిన్నమైన కామెడీ ఎంటర్టైనర్ గా, రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అయితే ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఇలాంటి సమస్యలు టాలీవుడ్లో ఎక్కువయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: