📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Suhas: ‘హే భగవాన్’ సినిమా టీజర్ విడుదల

Author Icon By Anusha
Updated: January 28, 2026 • 1:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Suhas: ‘Hey Bhagwan’ movie teaser released

‘కలర్ ఫోటో’, ‘రైటర్ పద్మభూషణ్’ వంటి విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్ (Suhas), ఇప్పుడు మరోసారి వినోదంతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన తాజా చిత్రం ‘హే భగవాన్’ ఫిబ్రవరి 20, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొనగా, తాజాగా విడుదలైన టీజర్ ఆ ఆసక్తిని మరింత పెంచింది.

Read Also: Anna Garu Vastaru Movie: ఓటీటీలోకి వస్తోన్న కార్తీ కొత్త సినిమా

గోపి అచ్చర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘రైటర్ పద్మభూషణ్’ ఫేమ్ షణ్ముఖ ప్రశాంత్ కథను అందించగా, వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చారు. వెన్నెల కిషోర్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషన్‌తో పాటు ఆద్యంతం వినోదాన్ని పంచే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 20, 2026న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరోసారి జంటగా

చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలనే కోరికతో ఉన్న యువకుడి కథే హే భగవాన్. నాకు ఎలాగో మా ఫాదర్ బిజినెస్ ఉంది అని చిన్నప్పటి హీరో క్యారెక్టర్ చెప్పడంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పెద్ద బిజినెస్ మాన్ లా సీనియర్ నటుడు నరేష్ వీకే ఎంట్రీ ఇస్తాడు.

అక్కడి నుంచి కామెడీతో టీజర్ నవ్విస్తూనే ఉంది.నెల రోజుల్లో నా టాలెంట్ ప్రూవ్ చేసుకుని నాన్న బిజినెస్ టేకప్ చేయాల్రా అంటూ ఫ్రెండ్ తో చెప్తాడు హీరో. కానీ వాళ్ల నాన్న చేసే బిజినెస్ ఏంటీ అన్నది మాత్రం ఎవరికీ చెప్పరు. ఈ సీక్రెట్ బిజినెస్ ట్విస్ట్ బాగుంది. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ తర్వాత సుహాస్ (Suhas), శివాని నాగరం ఈ చిత్రంతో మరోసారి జంటగా నటిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Hey Bhagavan Movie Hey Bhagawan Teaser latest news Suhas Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.