Gully Web Series Update: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) డిజిటల్ దునియాలోకి అడుగుపెడుతున్నారు. గతేడాది ‘జటాధర’ ఆశించిన విజయం అందించకపోయినా, ఇప్పుడు ఒక భారీ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ అనౌన్స్‌మెంట్ ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: Purnanavi Bhupalam Marriage: పెళ్లిపీటలెక్కిన నటి పునర్నవి.. వైరల్ అవుతున్నపెళ్లి ఫోటోలు
Gully Web Series Update: స్టార్ స్టడెడ్ కాస్ట్ (Star-Studded Cast)
ఇందులో సీనియర్ నటుడు జె.డి. చక్రవర్తి, హన్సిక మోత్వానీ, శ్రద్ధా శ్రీనాథ్, ఆదర్శ్ బాలకృష్ణ, నందగోపాల్, చైతు జొన్నలగడ్డ, ప్రిన్స్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు ఈ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ‘బాహుబలి’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఈ సిరీస్ ని క్రియేట్ చేశారు.‘గల్లీ’లో సుధీర్ బాబు మునుపెన్నడూ చూడని విధంగా, రఫ్ అండ్ మాస్ లుక్‌లో కనిపించారు.
హన్సిక అందంగా కనిపించింది. జేడీ చక్రవర్తి ఒక గ్యాంగ్‌స్టర్ గా కనిపించగా.. శ్రద్ధా శ్రీనాథ్ పోలీసాఫీసర్ పాత్ర పోషించింది. ఎలాంటి డైలాగ్స్ లేకుండా, హిందీ సాంగ్ ని బ్యాగ్రౌండ్ స్కోర్ గా వినిపిస్తూ సాగిన ‘గల్లీ’ ఫస్ట్ లుక్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. దీనికి శశి సుడిగాల కథ అందించగా.. శ్రీకాంత్ విస్సా, అభిజిత్ పూండ్ల డైలాగ్స్ రాశారు. ప్రసాద్ దేవినేని, శోబు యార్లగడ్డ నిర్మించిన ఈ సిరీస్ త్వరలోనే ప్రైమ్ వీడియోలో వివిధ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: