📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sudeep: మేం అక్కడ నటిస్తున్నా..వాళ్లు కన్నడ చిత్రాల్లో నటించట్లేదు

Author Icon By Aanusha
Updated: December 29, 2025 • 7:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కన్నడ సినిమా పరిశ్రమకు ఇతర భాషల నుంచి తగినంత మద్దతు లభించడం లేదంటూ ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ (Sudeep) ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ‘మార్క్’ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన, ఈ అంశంపై మాట్లాడారు. “నేను వ్యక్తిగతంగా అడిగినా కూడా, ఇతర భాషల స్టార్ హీరోలు మా సినిమాల్లో చిన్న పాత్రలు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు” అని సుదీప్ (Sudeep) పేర్కొన్నారు. ఇది పరిశ్రమల మధ్య ఉండాల్సిన సహాయ సహకారాల లోపాన్ని సూచిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

Read Also: TG: బతుకమ్మ యంగ్‌ ఫిలిం మేకర్స్‌ చాలెంజ్‌అవార్డుల ప్రదానోత్సవం

Sudeep: Even though we are acting there, they are not acting in Kannada films

విజయ్ కోసం ‘పులి’ సినిమాలో చేశా

తాను తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో ఎన్నోసార్లు అతిథి పాత్రలు చేశానని, కొన్ని సినిమాల్లో అయితే స్నేహం కోసమే పారితోషికం కూడా తీసుకోకుండా నటించానని సుదీప్ వెల్లడించారు. “డబ్బుకంటే నాకు ఫ్రెండ్‌షిప్ ముఖ్యం. సల్మాన్ ఖాన్ వ్యక్తిగతంగా అడిగినందుకే ‘దబాంగ్ 3’లో నటించాను. విజయ్ కోసం ‘పులి’ సినిమాలో చేశాను. అతనిలోని వినయం, మంచి మనసు నాకు చాలా ఇష్టం” అని సుదీప్ అన్నారు.

శివరాజ్‌కుమార్ కూడా ఇతర భాషా సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేశారని గుర్తు చేశారు. అలాగే ఇండస్ట్రీలో కొందరు స్టార్స్ మాత్రమే కాలాన్ని తట్టుకుని నిలుస్తారని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి వారు జీవితాంతం నటిస్తూ అభిమానుల ప్రేమ పొందుతారని వ్యాఖ్యానించారు. మిగతా చాలా మంది స్టార్స్ ఒక దశ తర్వాత కనుమరుగైపోతారని సుదీప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Kannada Cinema kiccha sudeep latest news Sandalwood Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.