📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Heroine: నిర్మాతగా, దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరోయిన్

Author Icon By Anusha
Updated: September 27, 2025 • 6:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు, తమిళ ప్రేక్షకులకు తమ ప్రత్యేక నటనతో పాపులర్‌గా ఉన్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar) తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని తాకింది. కేవలం నటనకు పరిమితం కాకుండా, ఇప్పుడు దర్శకనిర్మాతగా కూడా ఆమె తన ప్రతిభను పరీక్షించకోబోతున్నారు. తన సోదరి పూజా శరత్ కుమార్ (Pooja Sarath Kumar) తో కలిసి ‘దోస డైరీస్’ అనే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు వరలక్ష్మి తాజాగా ప్రకటించారు.

 Bigg Boss Season 9: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనే?

ఈ బ్యానర్‌పై తొలి చిత్రంగా ‘సరస్వతి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.ఈ చిత్రానికి వరలక్ష్మి దర్శకత్వం వహించడమే కాకుండా, ప్రధాన పాత్రలోనూ నటిస్తుండటం విశేషం. ఇది ఒక హై-ఆక్టేన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనుంది. విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌లో ‘సరస్వతి’ (‘Saraswati’) పేరులోని ‘తి’ అక్షరాన్ని ఎరుపు రంగులో హైలైట్ చేయడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

Heroine

యంగ్ హీరో నవీన్ చంద్ర కీలక పాత్రలు

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.ఈ ప్రాజెక్టులో భారీ తారాగణం పాలుపంచుకుంటోంది. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, నటి ప్రియమణి, యంగ్ హీరో నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.తన కొత్త ప్రయాణం గురించి వరలక్ష్మి స్పందిస్తూ.. “దోస డైరీస్ మొదటి పేజీ సరస్వతి మీ ముందుకు రాబోతుంది.

మా ప్రయాణం ఈరోజు ప్రారంభమైంది. రాబోయే పేజీలు మరింత ప్రకాశవంతంగా ఉంటాయి” అని తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే, పలువురు నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ దర్శకురాలిగా, నిర్మాతగా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

actress director Breaking News dosas diaries film production house latest news Pan India Release puja sarathkumar saraswati movie Telugu News thriller movie varalaxmi sarathkumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.