SS Rajamouli Review Dhurandhar 2: “మాస్టర్‌క్లాస్ ఇన్ యాక్టింగ్”: ‘ధురంధర్ 2’ పై రాజమౌళి రివ్యూ

Read Time:  1 min
ss-rajamouli-praises-ranveer-singh-dhurandhar-2-box-office-records
ss-rajamouli-praises-ranveer-singh-dhurandhar-2-box-office-records
FONT SIZE
GET APP

SS Rajamouli Review Dhurandhar 2: దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించిన ఈ సీక్వెల్ చిత్రంపై రాజమౌళి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.ధురంధర్ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజైంది. ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, రాంచరణ్ లాంటి హీరోలు ఈ సినిమాపై ప్రశంసలు గుప్పించారు. ఇక ఈ సినిమాపై దర్శక ధీరుడు రాజమౌళి ట్విట్టర్‌లో తన రివ్యూను పోస్ట్ చేశారు. ఆయన వెల్లడించిన విషయాల్లోకి వెళితే..

Read Also: Nandamuri Balakrishna Ramzan Wishes: ముస్లిం సోదరులకు బాలయ్య రంజాన్ శుభాకాంక్షలు

‘మాస్టర్‌క్లాస్ ఇన్ యాక్టింగ్’

ఈ చిత్రం మొదటి భాగం కంటే స్కేల్, ఎమోషన్ పరంగా అద్భుతంగా ఉందని, తనకు ‘ధురంధర్ 1’ అంటే చాలా ఇష్టమని కానీ సీక్వెల్ దానిని మించిపోయిందని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ముఖ్యంగా 4 గంటల సుదీర్ఘ నిడివి ఉన్నప్పటికీ, ప్రేక్షకులను సీటు నుంచి కదలకుండా చేయడంలో దర్శకుడు ఆదిత్య ధార్ విజయం సాధించారని, ఇది ఒక గొప్ప సాహసమని రాజమౌళి కొనియాడారు. రణవీర్ సింగ్ నటనను ప్రస్తావిస్తూ, షెడ్ లో చెల్లెలితో వచ్చే సన్నివేశం ఒక ‘మాస్టర్‌క్లాస్ ఇన్ యాక్టింగ్’ అని, హమ్జా మరియు జస్కీరత్ పాత్రల్లో ఆయన మెస్మరైజ్ చేశారని అభినందించారు. అలాగే ఆర్. మాధవన్ దేశం యొక్క నిస్సహాయతను తన నటనతో అద్భుతంగా పండించారని రాజమౌళి ప్రశంసించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.