हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Latest News: Srinidhi Shetty: తెలుసు క‌దా సినిమా గురించి శ్రీనిధి శెట్టి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు

Aanusha
Latest News: Srinidhi Shetty: తెలుసు క‌దా సినిమా గురించి శ్రీనిధి శెట్టి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు

కేజీఎఫ్‌ సినిమా (KGF movie) తో హీరోయిన్‌గా వెండితెరపై మెరిసి, ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కన్నడ బ్యూటీ అయిన ఆమెకు “కేజీఎఫ్” విజయంతో గణనీయమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. యష్ (Yash) సరసన చేసిన ఆ సినిమా ఆమెకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది.

Bigg Boss 9: తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్

ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని, కథా ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న శ్రీనిధి, ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) తో కలిసి నటించిన ‘తెలుసు కదా’ సినిమా (Telusu Kada Movie)తో తిరిగి ప్రేక్షకులను పలకరించబోతుంది.ఈ మూవీ అక్టోబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకురానుంది.

Srinidhi Shetty
Srinidhi Shetty

ప్ర‌తీ ఒక్క‌రూ ఎంజాయ్ చేస్తార‌ని

ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు షేర్ చేసుకుంది శ్రీనిధిశెట్టి (Srinidhi Shetty). చిట్ చాట్ సెష‌న్‌లో శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. కేజీఎఫ్‌, హిట్ 3 లాంటి వ‌యోలెన్స్‌, ర‌క్త‌పాతం చుట్టూ తిరిగే సినిమాల త‌ర్వాత సున్నిత భావోద్వేగాల‌తో సాగే సినిమా ఇది. ఈ మూవీ నాకు ఉత్తేజాన్ని క‌లిగించే మార్పులాంటిది. ఈ చిత్రాన్ని ప్ర‌తీ ఒక్క‌రూ ఎంజాయ్ చేస్తార‌ని ఆశిస్తున్నానంది.

తెలుసు క‌దా ప్రేమ‌, ఎమోష‌న్‌, న‌వ్వులు, అంద‌మైన పాట‌ల‌తో సాగే క‌మ‌ర్షియ‌ల్ సినిమా. ఈ సినిమా చూసిన త‌ర్వాత మూవీ ల‌వ‌ర్స్ ఒక అంద‌మైన రొమాంటిక్ డ్రామాను చూసిన‌ట్టు ఫీల్ అవుతారంది శ్రీనిధి.సినిమాకు ప‌నిచేయ‌డం గురించి మాట్లాడుతూ.. నాకు డైరెక్ట‌ర్ నీర‌జ కోన‌, సిద్ధు, రాశీ ఖ‌న్నాతో క‌లిసి న‌టించే అద్భుత‌మైన స‌మ‌యం దొరికింది. నీర‌జ కోన (Neeraj Kona) చాలా స‌పోర్ట్‌గా నిలిచే వ్య‌క్తి.

ప్రేక్ష‌కులు ఖ‌చ్చితంగా సిద్ధు పాత్ర‌తో ప్రేమ‌లో ప‌డిపోతారు. అత‌డికి ప్ర‌తీ విభాగంలో అద్బుత‌మైన‌ ప్రావీణ్యం ఉంది. రాశీఖ‌న్నా (Raashi Khanna) చాలా క్ర‌మ‌శిక్ష‌ణతో ఉండే వ్య‌క్తి అని చెప్పుకొచ్చింది.పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీతో క‌లిసి ప‌నిచేయ‌డం గొప్ప‌గా భావిస్తున్నానంది. సినిమాల ప‌ట్ల ఎంతో ప్యాష‌న్ ఉన్న నిర్మాత‌ల‌తో క‌లిసి ప‌ని చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నానంది శ్రీనిధిశెట్టి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870