📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Srinidhi Shetty: వారి ఇద్దరి సినిమాలకు డేట్స్ అడ్జెస్ట్ చేస్తా: శ్రీనిధి

Author Icon By Aanusha
Updated: October 5, 2025 • 6:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘KGF: చాప్టర్ 1’ సినిమాతో కేవలం నటనా ప్రతిభ మాత్రమే కాదు, స్క్రీన్ ప్రెజెన్స్, ప్యాన్ ఇండియా ప్రేక్షకులకి ఆకర్షణీయమైన లుక్ కూడా శ్రీనిధి (Srinidhi Shetty) ను ప్రత్యేకంగా నిలిపింది. ఈ విజయం తర్వాత ‘KGF: చాప్టర్ 2’లో శ్రీనిధి మరోసారి పెద్ద స్క్రీన్ మీద శక్తివంతమైన హిట్ ఇచ్చింది. ఈ మూవీ సంచలన విజయం సాధించడంతో, శ్రీనిధి పేరు దేశవ్యాప్తంగా వినిపించింది.

Mohanlal: మోహన్‌లాల్‌కు కేరళ ప్రభుత్వం సన్మానం

బ్యాక్ టూ బ్యాక్ రెండు భారీ హిట్లు పడటంతో శ్రీనిధి ఎక్కడికో వెళ్లిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకనో ఈ బ్యూటీ ఎక్కువ సినిమాల్లో కనిపించలేదు. క్రేజ్ ని క్యాష్ చేసుకోలేకపోయిందా?

ఆఫర్స్ వచ్చినా ఆచితూచి అడుగులు వేయాలని అనుకుందో? తెలియదు కానీ.. ఒక్కో సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటూ వస్తోంది. ఇప్పుడు లేటెస్టుగా ‘తెలుసు కదా’ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది.

Srinidhi Shetty

నీరజ కోన డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ రొమాంటిక్ డ్రామా

‘హిట్ 3: ది థర్డ్ కేస్’ సినిమాతో శ్రీనిధి శెట్టి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ చిత్రం (‘Telusu Kada’ movie) లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ అందుకుంది. నీరజ కోన డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ రొమాంటిక్ డ్రామాలో రాశీ ఖన్నా మరో కథానాయికగా నటించింది.

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని అక్టోబర్ 17న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ప్రమోషన్స్ (Promotions) లో భాగంగా శ్రీనిధి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలో తన ఫేవరేట్ హీరోల గురించి చెబుతోంది.

ఇంటర్వ్యూలో ర్యాపిడ్ రౌండ్ లో

అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై హింట్ ఇస్తోంది.ఓ ఇంటర్వ్యూలో ర్యాపిడ్ రౌండ్ లో భాగంగా ”ఒకేసారి సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (JR NTR) లతో వర్క్ చేసే అవకాశం వస్తే.. ఇద్దరిలో ఎవరిని ఎంచుకుంటారు?” అని ప్రశ్నించగా..

శ్రీనిధి చాలా తెలివిగా సమాధానం చెప్పింది. ”నా ఆఫర్స్ ఎందుకు తక్కువ చేసుకోవాలి. నాకు ఇద్దరూ కావాలి. ఇద్దరి సినిమాలకు డేట్స్ అడ్జెస్ట్ చేస్తా. డే అండ్ నైట్ డబుల్ కాల్షీట్స్ ఇస్తా” అని తెలిపింది. ఇటు మహేష్ (Mahesh Babu) అభిమానులని, అటు తారక్ ఫ్యాన్స్ ని సాటిస్పై చేసేలా సమాధానం చెప్పడంతో.. శ్రీనిధి చాలా తెలివైన పిల్లే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కింగ్ ఖాన్ అంటే తనకు ఇష్టమని

షారుఖ్ ఖాన్, టైగర్ ష్రాఫ్ లలో మాత్రం షారుఖ్ ని సెలెక్ట్ చేసుకుంది శ్రీనిధి. చిన్నప్పటి నుంచి కింగ్ ఖాన్ అంటే తనకు ఇష్టమని, చైల్డ్ హుడ్ క్రష్ అనే సాఫ్ట్ కార్నర్ ఉంటుందని చెప్పింది. తనకు రైస్, బొబ్బట్లు అంటే ఇష్టమని తెలిపింది.

నాని, సిద్ధూ జొన్నలగడ్డ ఇద్దరితో చాలా కంఫర్టబుల్ గా యాక్ట్ చేశానని.. సిద్ధూతో ఫన్నీగా, నానితో స్వీట్ గా అనిపించిందని బదులిచ్చింది. యష్ తన ఫస్ట్ కోస్టార్ కాబట్టి ఎప్పటికీ స్పెషల్ అని.. తెలుగులో నాని తన ఫస్ట్ హీరో కనుక ఆయన కూడా స్పెషలే అని చెప్పుకొచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News kannada actress srinidhi shetty kgf chapter 1 heroine kgf chapter 2 success latest news pan india fame srinidhi Srinidhi Shetty srinidhi shetty latest movie Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.