📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

News Telugu: Sreeleela: ఒక్కసారిగా స్లిమ్‌గా మారిన యంగ్ హీరోయిన్ శ్రీలీల

Author Icon By Rajitha
Updated: October 28, 2025 • 12:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్‌లో వేగంగా ఎదుగుతున్న నటి శ్రీలీల (Sreeleela) తన కొత్త లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల ఆమె చాలా సన్నగా మారిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ మార్పుపై అభిమానులు ఆశ్చర్యపోతుండగా, శ్రీలీల (sreeleela) స్వయంగా తన స్లిమ్ అవడానికి కారణం వివరించింది. “మునుపు అమ్మమ్మ పంపే అరిసెలు, బజ్జీలు, చెకోడీలు ఏవీ వదిలేదాన్ని కాదు. కానీ ఇప్పుడు వాటన్నింటినీ తగ్గించి, సరైన ఆహారం తీసుకుంటున్నాను. ఫుడ్ కంట్రోల్ వల్లే నేను ఇలా మారాను” అని చెప్పింది.

Read also: Prabhas:బాహుబలి: ది ఎపిక్ మళ్లీ తెరపై రీ రిలీజ్

Sreeleela

కొంతమంది ఆమె లుక్‌ను శ్రీదేవి (sridevi) తో పోలుస్తుండగా, ఆమె స్పందిస్తూ “నేను శ్రీదేవిని కాదు. ప్రతి ఒక్కరి శరీర ఆకృతి వేరు. నాకు నా బాడీ గురించి అవగాహన ఉంది, పైగా నేను డాక్టర్‌ని కూడా” అని తెలిపింది. ప్రేక్షకులు తనను తెరపై ఉత్తమంగా చూడాలని కోరుకుంటారని, అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నానని చెప్పింది. ప్రస్తుతం ఆమె పలు చిత్రాల్లో నటిస్తోందని, ‘మాస్ జాతర’లో తన పాత్ర వినోదాత్మకంగా ఉండబోతుందని వెల్లడించింది.

శ్రీలీల సడన్‌గా సన్నగా మారడానికి కారణం ఏమిటి?
ఫుడ్ కంట్రోల్, సరైన ఆహారం తీసుకోవడం వల్లనే శ్రీలీల స్లిమ్‌గా మారింది.

శ్రీదేవితో పోల్చడంపై శ్రీలీల ఎలా స్పందించింది?
“నేను శ్రీదేవిని కాదు, ప్రతి ఒక్కరి శరీర ఆకృతి వేరు” అని ఆమె స్పష్టం చేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

actress fitness latest news slim look Sreeleela Telugu News tollywood

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.