📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sreeleela:పెళ్లి వార్తలపై స్పష్టత ఇచ్చిన శ్రీలీల

Author Icon By Sharanya
Updated: June 1, 2025 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యువ నటి శ్రీలీల తాజాగా పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారారు. దక్షిణాది సినిమా పరిశ్రమలో బిజీ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న ఆమె, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న కొన్ని ఫోటోలు ఇంటర్నెట్‌ను ఊపేశాయి. అందులోనూ సంప్రదాయ దుస్తుల్లో, కుటుంబ సభ్యులతో కలిసి సందడిగా కనిపించడంతో నెటిజన్లు ఈ వేడుకను నిశ్చితార్థ వేడుకగా భావించారు. దీంతో ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని జోరుగా ప్రచారం మొదలైంది.

వాస్తవం ఏమిటి? శ్రీలీల స్పందన

ఈ ప్రచారానికి శ్రీలీల స్వయంగా ముగింపు పలికారు. శుక్రవారం ఆమె పంచుకున్న కొన్ని ఫోటోలు ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశాయి. అవన్నీ నిశ్చితార్థ వేడుక ఫోటోలంటూ జరుగుతున్న ప్రచారంపై శ్రీలీల తాజాగా స్పష్టతనిచ్చింది. అవి తన ప్రీ-బర్త్‌డే వేడుకలకు సంబంధించిన చిత్రాలని వెల్లడించింది.

వైరల్ అయిన ఫోటోల కథనం

దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్న శ్రీలీల సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటుంది. శుక్రవారం సాయంత్రం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో కుటుంబ సభ్యులు ఆమెకు నలుగు పెడుతూ కనిపించారు. దీనికితోడు ఆ ఫోటోలకు ‘బిగ్ డే’, ‘కమింగ్ సూన్’ వంటి క్యాప్షన్లు జోడించడంతో శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందని నెటిజన్లు భావించారు. పెళ్లి వార్తలు నిజమేనని పలువురు కామెంట్లు కూడా పెట్టారు.

శ్రీలీల వివరణ

ఈ ప్రచారం ఊపందుకోవడంతో శ్రీలీల దీనిపై స్పందించింది. తన ఇంట్లో జరిగిన వేడుక గురించి వివరిస్తూ, ‘‘నా ప్రీ బర్త్‌డే వేడుకలను ఇంట్లోనే మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా మా అమ్మ చూసుకున్నారు’’ అని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. దీంతో ఆమె పెళ్లి వార్తలకు ప్రస్తుతానికి తెరపడినట్లయింది

వేడుకలో కనిపించిన ప్రముఖులు
ఈ ప్రీ-బర్త్‌డే వేడుకల్లో శ్రీలీల సంప్రదాయబద్ధంగా చీరకట్టులో మెరిసింది. ఈ కార్యక్రమానికి నటుడు రానా దగ్గుబాటి సతీమణి మిహిక బజాజ్ కూడా హాజరై సందడి చేశారు. కాగా, శ్రీలీల జూన్ 14న తన 24వ పుట్టినరోజును జరుపుకోనుంది. ఈ పుట్టిన రోజుకు ముందు ప్రీ బర్త్ డే వేడుకలను కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీలీల పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

Read also: Manchu Manoj: కన్నప్ప హార్డ్ డిస్క్ పై స్పందించిన మంచు మనోజ్

#NoEngagement #PreBirthdayCelebration #Sreeleela #SreeleelaBirthday #SreeleelaClarifies #TeluguActress Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.