ప్రభాస్ – దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘స్పిరిట్’(Spirit) ఫస్ట్ పోస్టర్ విడుదలతో సోషల్ మీడియా ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. పోస్టర్‌లో ప్రభాస్ కనిపిస్తున్న పవర్‌ఫుల్ లుక్ అభిమానుల్లో భారీ ఎక్స్‌సైట్‌మెంట్‌ను పెంచుతోంది.
Read Also: Sankranti movies 2026: స్టార్ హీరోల సినిమాలతో సంక్రాంతి బాక్సాఫీస్ హీట్
సందీప్ వంగా స్టైల్‌లో కొత్త ప్రభాస్
ఇప్పటివరకు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాల ఫస్ట్ లుక్స్‌తో పోలిస్తే ‘స్పిరిట్’ పోస్టర్ మరింత ఇంటెన్సిటీతో కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈసారి ప్రభాస్‌ను పూర్తిగా భిన్నమైన కోణంలో చూపించేందుకు సందీప్ వంగా సిద్ధమవుతున్నాడని పోస్టర్ స్పష్టంగా సూచిస్తోంది.
పోస్టర్‌లో ప్రభాస్ కళ్లలో కనిపిస్తున్న ఆగ్రహం, ఆత్మవిశ్వాసం సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఫ్యాన్స్ ఇప్పటికే ఈ లుక్‌ను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ తమ స్పందన తెలియజేస్తున్నారు. ‘స్పిరిట్’(Spirit) ఫస్ట్ లుక్‌ను చూసిన తర్వాత ప్రభాస్ కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా మారబోతుందనే చర్చ నడుస్తోంది. సందీప్ రెడ్డి వంగా మార్క్ ఇంటెన్స్ నరేషన్‌తో ప్రభాస్‌ను కొత్త అవతారంలో చూడబోతున్నామనే అంచనాలు బలపడుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: