📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Telugu News: Sonakshi Sinha: టాలీవుడ్ వర్కింగ్ స్టైల్‌పై సోనాక్షి కామెంట్స్

Author Icon By Sushmitha
Updated: November 5, 2025 • 2:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ ప్రముఖ నటి సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) తన ‘జటాధర'(Jatadhara) చిత్ర ప్రమోషన్లలో భాగంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల పనివిధానాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది పరిశ్రమలో ఉండే సమయపాలన, క్రమశిక్షణను ఆమె ప్రశంసించగా, ఈ విషయంలో బాలీవుడ్ చాలా నేర్చుకోవాలని సూచించారు.

Read Also: Telangana: విద్యా రంగం పతనం – కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ విమర్శలు

Sonakshi Sinha

హిందీ పరిశ్రమలో పద్ధతి నచ్చదు: సోనాక్షి

ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి సిన్హా మాట్లాడుతూ, “నేను గతంలో తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేశాను. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. దక్షిణాది సినీ పరిశ్రమలో కొన్ని విషయాలు నాకు బాగా నచ్చాయి, ముఖ్యంగా ఇక్కడి సమయపాలన అద్భుతం” అని అన్నారు. టాలీవుడ్‌లో ఉదయం 9 గంటలకు షూటింగ్ మొదలైతే సాయంత్రం 6 గంటల కల్లా కచ్చితంగా పూర్తిచేస్తారని, దీనికి ఎంతో క్రమశిక్షణ అవసరమని తెలిపారు. దీనికి భిన్నంగా, “హిందీ పరిశ్రమలో ఇలాంటి వాతావరణం ఉండదు. అక్కడ సమయపాలన పాటించరు, అర్ధరాత్రి వరకు షూటింగ్‌లు జరుగుతూనే ఉంటాయి. ఆ పద్ధతి నాకు అస్సలు నచ్చదు,” అని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో టాలీవుడ్‌ను చూసి హిందీ వాళ్లు మారాలని ఆమె కోరుకున్నారు.

‘జటాధర’ సినిమా వివరాలు

సోనాక్షి సిన్హా నటిస్తున్న ఈ చిత్రం నవ దళపతి సుధీర్ బాబు(Sudheer Babu) హీరోగా తెరకెక్కుతోంది. పాన్-ఇండియా ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఈ చిత్రాన్ని ఉమేశ్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్ వంటివారు నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

bollywood Film Industry Google News in Telugu Indian Cinema Jataadhara Movie Latest News in Telugu Sonakshi Sinha South Indian Cinema Sudheer Babu Telugu News Today time management tollywood

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.