బాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. దబాంగ్, రౌడీ రాథోర్, లూటేరా, హాలిడే, వంటి హిట్ చిత్రాలతో బాలీవుడ్ (Bollywood) లో సుస్థిరమైన స్థానం ఏర్పరుచుకున్న సోనాక్షి, తన అందం, అద్భుతమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించారు. ఇప్పుడు ఆమె తొలిసారిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు.
Read Also: Rajasekhar: ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధం: రాజశేఖర్
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఫాంటసీ చిత్రం “జటాధర” (“Jatadhara” Movie) ద్వారా సోనాక్షి సిన్హా తెలుగు తెరపై కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఫాంటసీ, యాక్షన్, మిస్టిక్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమా ప్రస్తుతం సినిమా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సోనాక్షి సిన్హా ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రలన్నింటికంటే ఇది భిన్నమైన రోల్ అని స్వయంగా సోనాక్షి పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ, “జటాధర నా కెరీర్‌లో ఒక కొత్త దశను ప్రారంభించబోతుంది. నేను ఇంతకు ముందు చేసిన పాత్రలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నం.
ఈ సినిమాలో పవర్‌ఫుల్ యాక్షన్ రోల్‌లో
ఇందులోని యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్, కథా నేపథ్యం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి” అని తెలిపారు.సుధీర్ బాబు (Sudheer Babu) కూడా ఈ సినిమాలో పవర్‌ఫుల్ యాక్షన్ రోల్‌లో కనిపించబోతున్నారు. టీజర్, పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఫ్యాన్స్ సోనాక్షి విలన్‌గా ఎలా కనిపించబోతుందో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇటీవల ప్రమోషన్లలో పాల్గొన్న సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) తన పాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “నా కెరీర్‌లో ఇది ఫిజికల్‌గా అత్యంత కష్టమైన పాత్ర. నేను ధరించిన ఆభరణాల బరువు ఏకంగా 50 కిలోలు ఉండేది. ప్రతి రోజు షూటింగ్‌కి సిద్ధం కావడానికి మూడు గంటల సమయం పట్టేది.
ఆభరణాలు చీరకు కుట్టి వేసేవారు
ఆ కాస్ట్యూమ్ వేసుకుని కదలడమే కష్టం, కానీ యాక్షన్ సీన్స్ చేయడం మరింత ఛాలెంజ్‌గా మారింది. ఆభరణాలు చీరకు కుట్టి వేసేవారు, యాక్షన్ సమయంలో అవి కదలకుండా ఉండేందుకు అలా చేయాల్సి వచ్చేది.
రోజంతా ఆ డ్రెస్సులో ఉండడం అలసట కలిగించేది కానీ ఆ పాత్ర అందించిన సంతృప్తి మాత్రం అపారమైనది” అని చెప్పింది. ఈ చిత్రంలో తన లుక్, మేకప్, కాస్ట్యూమ్స్ అన్నీ కొత్తగా ఉన్నాయని, ఆ మార్పు తనను చాలా ఎగ్జైటెడ్‌గా చేసిందని సోనాక్షి (Sonakshi Sinha) వివరించింది. “ఇది నాకు కొత్త అనుభవం. పాత్ర బలమైనదిగా, భావోద్వేగపూరితంగానూ ఉంటుంది. ఆ శ్రమ అంతా ఫలించింది” అని చెప్పింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: