📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Smriti Irani: దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్

Author Icon By Anusha
Updated: October 15, 2025 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే (Deepika Padukone) ఇటీవల తన ఇంటర్వ్యూలో ప్రతిపాదించిన “రోజుకు 8 గంటల పని చాలు, దాని మించిన పని మానసిక ఒత్తిడికి దారితీస్తుంది” అనే వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.

ఈ వ్యాఖ్యలపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటి స్మృతి ఇరానీ (Smriti Irani) కూడా దీపిక వ్యాఖ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read Also:  Sai Dharam Tej: సాయి ధ‌ర‌మ్ తేజ్ బర్త్‌డే.. సంబ‌రాల ఏటిగ‌ట్టు గ్లింప్స్ విడుదల

ప్రస్తుతం స్మృతి ఇరానీ దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి టెలివిజన్ తెరపైకి రానున్నారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా హిట్ అయిన సీరియల్ ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’ ఇప్పుడు సీక్వెల్ రూపంలో వస్తోంది. ఇందులో స్మృతి (Smriti Irani) మళ్లీ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, దీపిక ప్రతిపాదించిన 8 గంటల పని విధానంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇది పూర్తిగా దీపిక పదుకొనే వ్యక్తిగత విషయం. కానీ నటులు నిర్మాతల బాగోగులు కూడా చూసుకోవాలి. కొన్ని వివాదాలు కేవలం సంచలనం కోసం సృష్టిస్తారు. అటువంటి విషయాలలో పాల్గొనేంత అమాయకురాలిని కాదు నేను.

Smriti Irani

నష్టం రాకుండా చూసుకోవడం నటులుగా మా బాధ్యత

కానీ నిర్మాతలను చూసుకోవాలి, వాళ్లకు నష్టం రాకుండా చూసుకోవడం నటులుగా మా బాధ్యత. ఈ రోజు పని చేయాలని నాకు అనిపించడం లేదని చెప్పడం వృత్తిపరంగా ఆమోదయోగ్యం కాదు. సీరియల్స్ (serials) చేస్తున్నపుడే రెండుసార్లు నేను గర్భం దాల్చాను.. అప్పుడు కూడా పని చేసాను.

ఒక్క రోజు మనం రాకపోతే 120 మందికి ఆ రోజు చెక్కు అందదు. అది 120 కుటుంబాలకు అన్యాయం అవుతుంది. నటిగా ఉండటం, రాజకీయాల్లో ఉండటం, తల్లిగా ఉండటం అనేవి నా ఛాయిస్.. దానిపై బాధ్యత నాదే.. అదే సమయంలో నటులుగా మనం చేసే పనిపై నిబద్ధత కూడా ఉండాలి’ అంటూ ఇన్ డైరెక్టుగా దీపిక కు కౌంటర్ ఇచ్చారు స్మృతి.

8 గంటల పని విధానం మీ అభిప్రాయం తెలపండి?

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

8 hours work Breaking News Deepika Padukone latest news Smriti Irani Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.