📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Shruti Haasan: కమల్ హాసన్‌ థగ్‌లైఫ్‌ సినిమా ప్లాప్ పై శృతిహాసన్ ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: August 19, 2025 • 2:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళ సినీ పరిశ్రమలో రజినీకాంత్ అంటే ఒక ప్రత్యేక స్థానం కలిగిన సూపర్ స్టార్. ఆయన నటించిన ప్రతి సినిమాను అభిమానులు పెద్ద ఆసక్తితో చూస్తారు. అలాంటి సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన తాజా సినిమా ‘కూలీ’ విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద రికార్డులు సాధిస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులంతా ఈ సినిమాకు పెద్ద స్పందన చూపుతున్నారు.‘కూలీ’ సినిమాలో రజినీకాంత్ టైటిల్ రోల్‌లో ఉన్నప్పటికీ, సినిమాలో కీలక పాత్రలో శృతిహాసన్ (Shruti Haasan) నటించారు.అభిమానులు, సినీ వర్గాలు ఆమె నటనను ప్రత్యేకంగా గుర్తించి, ప్రశంసించారు.సినిమా రికార్డులు బ్రేక్ చేయడం, ప్రేక్షకుల వద్ద పెద్ద ప్రేమ పొందడం ఇంతే కాదు, శృతి ఇటీవల కూలీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో రౌండప్ అవుతున్నాయి.

జనాలు అంచనాలు వేసే నంబర్‌ గేమ్స్‌

ఈ ఇంటర్వ్యూలో ఆమె తండ్రి కమల్ హాసన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శృతి తండ్రి తనకు అందించిన ప్రేరణ, సలహాలు, సినీ జీవితంలో తనను నిర్మాణాత్మకంగా ఎలా మారుస్తుయో వివరించారు.మణిరత్నం డైరెక్షన్‌లో కమల్ హాసన్‌ లీడ్ రోల్‌లో నటించిన థగ్‌లైఫ్‌ బాక్సాఫీస్‌ వద్ధ ఊహించని విధంగా బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఇంటర్వ్యూలో థగ్‌లైఫ్‌ (Thug Life) ఫెయిల్యూర్‌ మీ తండ్రిపై ప్రభావం చూపుతుందా.? అని అడిగిన ప్రశ్నకు శృతిహాసన్ తనదైన శైలిలో స్పందించింది. పదేళ్ల క్రితం నంబర్స్‌ (అంకెలు) కు సంబంధించిన చర్చ జరుగలేదు. తన సొంత డబ్బంతా సినిమాకే ఖర్చు పెట్టే మనస్తత్వం నుండి నాన్నగారు వచ్చారు. జనాలు అంచనాలు వేసే నంబర్‌ గేమ్స్‌ ఆయనను ప్రభావితం చేయవంది శృతిహాసన్.

Shruti Haasan

అక్కడే ఉందని తెలుసుకుని నా డైరెక్షన్‌లో

అంతేకాదు ఇది (నంబర్‌ గేమ్‌) నవతరం ధనవంతుల సమస్య అని నేను అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.కమల్ హాసన్‌ స్వభావం మీ మీద పడిందా అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. అవును ఆయన స్వభావం (నీడ) నాపై ఎప్పుడూ ఉంటుంది. కానీ దానిని ఎదుర్కొంటానా..? లేదా అది అక్కడే ఉందని తెలుసుకుని నా డైరెక్షన్‌లో నేను నడుస్తున్నానా..? అనేది తెలియాలి. అప్పా (నాన్న) నాలోని వెలుగును కప్పి ఉంచే నీడగా కంటే.. నా జీవితంలో నీడను సృష్టించే సూర్యుడిలా ఉంటారంది శృతిహాసన్‌. మొత్తానికి శృతిహాసన్‌ తన తండ్రి గురించి గొప్పగా చెప్పకనే చెబుతూ చేసిన కామెంట్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

శృతి హాసన్ తొలి సినిమా ఏది?

బాల్యనటిగా హే రామ్ (2000) సినిమాలో కనిపించింది. హీరోయిన్‌గా ఆమె తొలి చిత్రం బాలీవుడ్‌లో వచ్చిన లక్ (2009).

శృతి హాసన్ ఏ ఏ భాషల్లో సినిమాలు చేసింది?

శృతి హాసన్ తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించింది. బాలీవుడ్‌లో కూడా కొన్ని ప్రాజెక్టుల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/rashmika-mandanna-horror-movie-thaama-teaser-release/cinema/532509/

Box Office Records Breaking News Coolie Movie Kamal Haasan Kollywood News latest news Rajinikanth Shruti Haasan Tamil Cinema Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.