📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Shivaji: వార్నింగ్ ఇస్తే భయపడే రకం కాదు: శివాజీ ఘాటు వ్యాఖ్యలు

Author Icon By Tejaswini Y
Updated: December 27, 2025 • 4:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బతుకుదెరువు కన్నా ఆత్మాభిమానమే ముఖ్యం

జీవనోపాధి కోసం ఈ రంగంలోకి వచ్చినవాడినని, ఇక్కడ అవకాశం లేకపోతే మరెక్కడైనా జీవించుకుంటానని కానీ తన ఆత్మగౌరవాన్ని(self rescpect) మాత్రం త్యాగం చేయనని శివాజీ(Shivaji) స్పష్టం చేశారు. వ్యవస్థలకు, పరిశ్రమకు గౌరవం లేకుండా విలువలేని జీవితం గడపడం తన వల్ల కాదన్నారు. ఇకపై ఎవరికైనా సలహాలు ఇవ్వడం, మంచిమాటలు చెప్పడం అవసరం లేదని తనకు అనుభవంతో అర్థమైందని వ్యాఖ్యానించారు. హెచ్చరికలు ఇస్తే భయపడిపోయే వ్యక్తిని తాను కాదని కూడా ఆయన తేల్చిచెప్పారు.

Read Also: Karate Kalyani: శివాజీ వ్యాఖ్యలపై కరాటే కల్యాణి ఏమన్నారంటే?

హెచ్చరికలతో వెనక్కి తగ్గే వ్యక్తిని కాను

ఇదే సందర్భంలో శివాజీ(Shivaji) మాట్లాడుతూ… తన మాటలను వక్రీకరించి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేయడం బాధాకరమన్నారు. సమాజంలో విలువల గురించి మాట్లాడితే తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరినీ కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదని, తన భావాలను మాత్రమే వ్యక్తపరిచానని చెప్పారు. వ్యక్తిగత గౌరవం, ఆత్మాభిమానం ఉన్నంత కాలం ఎవరి ఒత్తిళ్లకైనా లొంగనని, అవసరమైతే ఒంటరిగా నిలబడతానని శివాజీ స్పష్టం చేశారు.

సలహాలు, సూచనల యుగం ముగిసింది: శివాజీ ఆవేదన

అదే విధంగా, ప్రస్తుత పరిస్థితుల్లో నిజం మాట్లాడే వారికి స్థానం లేకుండా పోతుందనే భావన కలుగుతోందని శివాజీ వ్యాఖ్యానించారు. వ్యవస్థలను ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. తాను ఎదుర్కొంటున్న పరిణామాలు ఇతరులకు ఒక పాఠం కావాలని, అయినప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ, ఎలాంటి వివాదాలకు అతీతంగా తన ప్రయాణం కొనసాగించానని గుర్తు చేశారు. తన పేరు మీద నిర్మించుకున్న గౌరవం ఒక్క రోజులో కూల్చేయలేమని, నిజాయితీగా జీవించడం తన సిద్ధాంతమని చెప్పారు. అవసరమైతే కష్టాలు భరించడానికి సిద్ధమే కానీ, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని మాత్రం చేయనని శివాజీ మరోసారి దృఢంగా ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

shivaji Comments Shivaji Latest News Shivaji Statement Telugu Cinema News Tollywood Controversy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.