📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Sharwanand: శర్వానంద్ ‘బైకర్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Author Icon By Saritha
Updated: March 12, 2026 • 4:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Sharwanand: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు తన రూట్ మార్చి ఒక సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘బైకర్’ (Biker) ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Read Also: Dhurandhar2: ‘ధురంధర్-2’ నుంచి ‘ఆరి ఆరి’ పాట‌ విడుద‌ల‌

Sharwanand: Sharwanand’s ‘Biker’ release date fixed

వాయిదా పడుతూ వస్తున్న సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. లేటెస్ట్ గా చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఏప్రిల్ 3న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయం. ఈ సినిమా కోసం శర్వానంద్ ప్రాణం పెట్టారనే చెప్పాలి. ఒక ప్రొఫెషనల్ బైక్ రైడర్ పాత్రలో కనిపించడం కోసం ఆయన తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. శారీరకంగానే కాకుండా, బైక్ రేసింగ్కు సంబంధించిన మెళకువలను నేర్చుకోవడానికి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు.

ఇటీవల విడుదలైన పోస్టర్లు, టీజర్ గ్లింప్స్ చూస్తుంటే శర్వా లుక్ ఎంతో స్టైలిష్గా, మునుపెన్నడూ చూడని విధంగా ఉంది. ‘ట్యాక్సీ వాలా’ ఫేమ్ మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. శర్వా, మాళవికల మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు మరో ఆకర్షణ కానుంది. సీనియర్ హీరో రాజశేఖర్ ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర సినిమా మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Biker release date Sharwanand Biker movie Sharwanand new movie telugu movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.