శర్వానంద్ క(Sharwanand) థానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారీ’ సంక్రాంతి సందర్బంగా, ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అనిల్ సుంకర – రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందనేది ఇప్పుడు చూద్దాం.
కథ
గౌతమ్ (శర్వానంద్) వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. తన సహోద్యోగి నిత్య (సాక్షి వైద్య)తో పీకల్లోతు ప్రేమలో ఉంటాడు. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో.. గౌతమ్ గతం అతన్ని వెంటాడుతుంది. తన మాజీ ప్రేయసి దియా (సంయుక్త మీనన్) అదే ఆఫీసుకి టీమ్ లీడర్‌గా వస్తుంది. ఈ ముగ్గురి మధ్య నడిచే డ్రామా, తన గతాన్ని దాచి ప్రస్తుత ప్రేమను కాపాడుకోవడానికి గౌతమ్ పడే పాట్లు, చివరకు కథ ఎటు మలుపు తిరిగింది? అనేదే మిగిలిన కథ..
Read Also: Anaganaga Oka Raju Movie: ‘అనగనగా ఒక రాజు’- సినిమా ఎలా ఉందంటే?
విశ్లేషణ
దర్శకుడు రామ్ అబ్బరాజు తన గత చిత్రం ‘సామజవరగమన’తోనే తను క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లను డీల్ చేయడంలో సిద్ధహస్తుడని నిరూపించుకున్నారు. ఈ సినిమాలో కూడా అదే ఫార్ములాను నమ్ముకున్నారు. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినప్పటికీ, దానిని నడిపించిన స్క్రీన్‌ప్లే, పండించిన హాస్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా నేటి కాలపు సంబంధాలు, తండ్రి-కొడుకుల మధ్య ఉండే సరదా గొడవలను చాలా సహజంగా, హాస్యాస్పదంగా చూపించడంలో దర్శకుడు విజయం సాధించారు.
శర్వానంద్ కామెడీ టైమింగ్.. నరేష్ పాత్ర, ఆయన నటన.. కడుపుబ్బ నవ్వించే డైలాగ్స్.. కుటుంబంతో కలిసి చూడదగ్గ క్లీన్ కంటెంట్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. రొటీన్ కథ కావడం.. ఊహకందేలా ఉండే క్లైమాక్స్.. అక్కడక్కడా సాగదీసినట్లు అనిపించే సన్నివేశాలు లాంటివి మైనస్ అయ్యాయి.‘నారీ నారీ నడుమ మురారి’. కథలో కొత్తదనం ఆశించకుండా.. రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకోవాలనుకునే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయిస్.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: