📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Sharwanand: ‘బైకర్’ మూవీ వాయిదా?

Author Icon By Anusha
Updated: November 23, 2025 • 12:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన నటన, విభిన్నమైన స్క్రిప్ట్ సెలెక్షన్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్‌ (Sharwanand), గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఎన్నో ప్రయోగాలు చేస్తూ, కొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన, కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో, తన తదుపరి చిత్రం “బైకర్” పట్ల శర్వా ప్రత్యేక దృష్టి పెట్టాడు.

Read Also: Kriti Sanon: ఢిల్లీ కాలుష్యంపై స్పందించిన కృతి

తన కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ కాగల సినిమా ఇదే అవుతుందన్న నమ్మకంతో చాలా కష్టపడ్డాడు. బైక్ రేసింగ్ నేపథ్యంలో వచ్చే స్పోర్ట్స్ డ్రామా కావడం, యాక్షన్–ఎమోషన్ మిక్స్ కావడం వల్ల శర్వానంద్ అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో శర్వా (Sharwanand) బైక్ రేసర్ పాత్రలో కనిపించనున్నాడు.

యువీ క్రియేషన్స్ (UV Creations) ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. ముఖ్యంగా సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడం స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. గ్లింప్స్, పాటలు విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి బజ్ ఏర్పడింది. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ మూవీకి టెక్నికల్ టీమ్ కూడా బలంగానే ఉంది. 

Sharwanand: ‘Biker’ movie postponed?

అఖండ 2 కోసం బైకర్ వాయిదా

కాగా, డిసెంబర్ 5న విడుదలవుతున్న బాలకృష్ణ “ అఖండ 2 ” (“Akhanda 2”) కు వచ్చిన భారీ హైప్ కూడా మేకర్స్‌ను ఆలోచింపజేసినట్లు కనిపిస్తోంది. ‘అఖండ 2’ పాన్ ఇండియా విడుదల, ట్రైలర్‌కు వచ్చిన అద్భుత రెస్పాన్స్ అన్నీ కలిసి శర్వా మూవీకి సేఫ్ రన్ ఇవ్వకపోవచ్చని భావించి బైకర్ ‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుత సమాచారం ప్రకారం సినిమా ఒక వారం వరకు వాయిదా పడే అవకాశం ఉంది. అయితే కొత్త విడుదల తేదీపై మాత్రం ఇంకా అధికారిక పోస్టర్ లేదా స్టేట్‌మెంట్ రాలేదు. త్వరలోనే అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. తాజా వార్తలో శర్వానంద్ ఫ్యాన్స్ ఫీలవుతున్నా క్వాలిటీ విషయంలో రాజీ పడట్లేదన్న వార్త ఊరట కలిగిస్తోంది.

‘అఖండ 2’కి ఉన్న హైప్‌ కారణంగా ఆ చిత్రంతో పోటీ పడకపోవడమే బెటరని, సోలోగా వస్తే రిజల్ట్ బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద క్వాలిటీని మెరుగుపరచడానికి, అఖండ 2తో క్లాష్ నివారించడానికి “బైకర్” వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కొత్త విడుదల తేదీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Biker movie latest news Sharwanand Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.