ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘శంబాల’ (Shambala Movie) ప్రేక్షకులను థియేటర్లలోనే కాదు, ఓటీటీ వేదికపై కూడా ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదట బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుని మంచి వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా కథ, స్క్రీన్‌ప్లే, మిస్టరీ అంశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయనే అభిప్రాయం వ్యక్తమైంది. థియేటర్లలో మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై ఓటీటీ రిలీజ్‌కు ముందే అంచనాలు పెరిగాయి.ఆది నటనకు తోడు శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం ఈ థ్రిల్లర్ ను, మరో స్థాయికి తీసుకెళ్లింది.
Read Also: Ram Charan: స్పెషల్ ఫొటో పంచుకున్న నటుడు
11 రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు
ఈ చిత్రంలో అర్చన అయ్యర్, మధునందన్, రవి వర్మ కీలక పాత్రల్లో నటించగా, మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు సంయుక్తంగా నిర్మించారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఓటీటీలోనూ ఈ మూవీ (Shambala Movie) రికార్డులు తిరగరాస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో విడుదలైన ఈ చిత్రం, కేవలం 11 రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
ప్రస్తుతం తెలుగులో దూసుకుపోతున్న ఈ చిత్రం త్వరలోనే హిందీ ప్రేక్షకులను కూడా పలకరించనుంది. ‘శంబాల’ హిందీ వెర్షన్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) దక్కించుకున్నట్లు సమాచారం. త్వరలోనే హిందీలో కూడా స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో, ఈ వ్యూవర్షిప్ లెక్కలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక మంచి కమర్షియల్ హిట్ ఆది ఖాతాలో పడటంతో, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: