Shakira India Tour Postponed: ప్రపంచ పాప్ సంచలనం షకీరా (Shakira) భారత పర్యటన కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది మింగుడుపడని వార్త. దాదాపు 19 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత షకీరా భారత్‌లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. షకీరా కచేరీలు, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాల కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి.జోమాటోకు చెందిన ‘డిస్ట్రిక్ట్’ (District) ప్లాట్‌ఫారమ్ ఈ మెగా ఈవెంట్‌ను భారీ ఎత్తున ప్లాన్ చేసింది. అయితే, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఈ వేడుకపై నీలి నీడలు కమ్మేలా చేశాయి.
Read Also: Sundeep Kishan New Movie: ‘శంబాల’ మేకర్స్‌తో సందీప్ కిషన్ క్రేజీ ప్రాజెక్ట్
Shakira India Tour Postponed: టికెట్ రిఫండ్ (Refund) వివరాలు:
ఏప్రిల్ 10, 11 తేదీల్లో ముంబైలో, అలాగే ఏప్రిల్ 15న ఢిల్లీలో ఈ వేడుకలు జరగాల్సి ఉంది. షకీరా భారత్‌లో ప్రదర్శన ఇవ్వబోతుండటంతో భారీ ఎత్తున టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా షకిరాతో పాటు, అభిమానుల భద్రతే తమకు ముఖ్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. టికెట్లు కొనుగోలు చేసిన వారికి 5 నుంచి 7 పని దినాల్లో పూర్తి డబ్బు వెనక్కి ఇస్తామని (Refund) హామీ ఇచ్చారు. కాగా, కేవలం కాన్సర్ట్ టికెట్లే కాకుండా విమాన ప్రయాణాలు, హోటల్ బుకింగ్స్ చేసుకున్న అభిమానులు ఈ హఠాత్తు నిర్ణయంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: