📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

Satya: ‘జెట్లీ’ సినిమా గ్లింప్స్ చూసారా?

Author Icon By Anusha
Updated: January 4, 2026 • 1:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Satya: Have you seen the glimpses of the movie ‘Jaitley’?

‘మత్తు వదలరా’ సినిమాతో టాలీవుడ్‌లో ఓ కొత్త తరహా కామెడీకి బీజం వేసిన కాంబో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా సాధించిన విజయంతో దర్శకుడు రితేష్ రానా, కమెడియన్ సత్య కలిసి మరోసారి ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈసారి సత్య పూర్తిస్థాయి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జెట్లీ’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.‘మేడిపండు చూడ మేలిమై యుండును..’ అనే వేమన పద్యంతో ఈ గ్లింప్స్ ప్రారంభం అయ్యింది.

Read also: Mahesh Babu: పారిస్‌లో ‘వారణాసి’మూవీ టీజర్ విడుదల?

సినిమాపై అంచనాలను పెంచుతోంది

ఒక ఫ్లైట్ హైజాక్ నేపథ్యంలో సాగే ఈ కామెడీ సన్నివేశాలు గ్లింప్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్, సత్య మధ్య వచ్చే సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. “నువ్వు ఏ టైర్ హీరోవి?” అని వెన్నెల కిషోర్ వేసిన ప్రశ్నకు, సత్య తనదైన శైలిలో “నేను జనరల్ కంపార్ట్‌మెంట్ హీరోని” అంటూ సమాధానం ఇవ్వడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.

సత్య, రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని నిర్మాత చెర్రీ తెలిపారు. ‘మత్తు వదలరా’ సిరీస్ తర్వాత వస్తున్న ఈ సినిమా, ప్రేక్షకులకు మరోసారి నాన్-స్టాప్ వినోదాన్ని పంచుతుందని దర్శకుడు రితేష్ రానా ధీమా వ్యక్తం చేశారు. ఇక వేసవి కానుకగా ‘జెట్లీ’ థియేటర్లలో సందడి చేయనుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Jetly movie latest news Mathu Vadalara Ritesh Rana Satya Hero Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.