📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Sarvam Maya Movie: ఈ నెల 30 నుంచి ఓటీటీలోకి ‘సర్వంమాయా’

Author Icon By Anusha
Updated: January 25, 2026 • 11:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఫాంటసీ హారర్ కామెడీ చిత్రం ‘సర్వంమాయా’ (Sarvam Maya Movie) ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అఖిల్ సత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించింది. విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.‘సర్వంమాయా’ ఇప్పుడు డిజిటల్ సందడికి సిద్ధమైంది.

Read Also: Pawan Kalyan: సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్?

Sarvam Maya Movie: ‘Sarvam Maya’ to be released on OTT from the 30th of this month

సరికొత్త రికార్డు

ఈ చిత్రం (Sarvam Maya Movie) బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కేవలం 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ మూవీ, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 145 కోట్లకు పైగా వసూళ్లను సాధించి మలయాళ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఒక నాస్తికుడైన బ్రాహ్మణ యువకుడికి, ఒక ‘జెన్-జెడ్’ దయ్యానికి మధ్య సాగే ఆసక్తికర ప్రయాణంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తోంది.థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘జియో హాట్‌స్టార్’ కైవసం చేసుకుంది.

జనవరి 30 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో ఈ చిత్రం అందుబాటులోకి రాబోతుంది. ‘ప్రేమమ్’ వంటి భారీ హిట్ తర్వాత సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నివిన్ పౌలీకి ఈ సినిమా గట్టి కంబ్యాక్ ఇచ్చిందని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. ఇందులో రియా షిబు, అజు వర్గీస్ కీలక పాత్రలు పోషించగా, జస్టిన్ ప్రభాకరన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Malayalam Cinema Nivin Pauly Sarvamaya Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.