Santosh Shobhan: కపుల్‌ ఫ్రెండ్లీ ట్రైలర్‌ చూసారా!

Read Time:  1 min
Santosh Shobhan: కపుల్‌ ఫ్రెండ్లీ ట్రైలర్‌ చూసారా!
FONT SIZE
GET APP
Santosh Shobhan: Have you seen the Couple Friendly trailer?
Santosh Shobhan: Have you seen the Couple Friendly trailer?

టాలీవుడ్‌లో యూత్‌ఫుల్‌ కాన్సెప్ట్‌లకు మంచి ఆదరణ లభిస్తున్న సమయంలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ యాక్టర్ సంతోష్ శోభన్ (Santosh Shobhan), మానస వారణాసి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. ఈ మూవీకి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.

ట్రైలర్ ఆకట్టుకుంటోంది

వాలెంటైన్స్‌ డే కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్‌ లాంచ్ చేశారు. తాజాగా రిలీజైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ను ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఒక యువ జంట మధ్య సాగే సహజీవనం, వారి ప్రయాణంలో ఎదురయ్యే సరదా సన్నివేశాలు, కుటుంబాల మధ్య తలెత్తే సంఘర్షణలతో ఈ చిత్రం రూపుదిద్దుకున్నట్లు ట్రైలర్ చూస్తుంటే స్పష్టం అవుతోంది.

Read Also: Mrunal Thakur: బ్రేకప్‌పై మృణాల్ షాకింగ్ కామెంట్స్..

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.