నిజాయతీగా వ్యవహరించిన ఓ పారిశుద్ధి కార్మికురాలిని (Sanitation Worker) ఇంటికి పిలిచి స్వయంగా సత్కరించారు రజనీకాంత్. మరోసారి తన ఉదార స్వభావాన్ని, మంచి మనసును చాటుకున్నారు. ఆమె నిజాయతీని మెచ్చి ఓ బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చి అభినందించారు.
Read Also: Chiranjeevi: ఫిబ్రవరి 11 నుంచి OTTలోకి ‘మన శంకర వరప్రసాద్ గారు’
ఆమె నిజాయతీని బంగారు గొలుసు బహుమానంగా
చెన్నైకి చెందిన పద్మ అనే మహిళ పారిశుద్ధ్య కార్మికురాలిగా (Sanitation Worker) పనిచేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో టీ నగర్‌లో విధుల్లో ఉండగా, ఆమెకు ఓ పర్సు దొరికింది. దాన్ని తెరిచి చూడగా, అందులో 45 సవర్ల (తులాల) బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఏమాత్రం ఆశపడని పద్మ, వెంటనే తన పై అధికారులకు సమాచారం అందించి, ఆ బంగారాన్ని పాండీ బజార్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ జరిపి, ఆ ఆభరణాలను అసలు యజమానులకు అందజేశారు.
పద్మ నిజాయతీ గురించి తెలిసి పలువురు ఆమెను ప్రశంసించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ స్వయంగా ఆమెను అభినందించి, లక్ష రూపాయల చెక్కును బహుమతిగా అందించారు. తాజాగా ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), మంగళవారం పద్మను తన నివాసానికి ఆహ్వానించారు. ఆమె నిజాయతీని ప్రశంసించి, ఓ బంగారు గొలుసును బహూకరించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: