Sania Mirza: దుబాయ్ లో యుద్ధం చూసి వణికిపోయాం.. సానియా మీర్జా

Read Time:  1 min
Sania Mirza: దుబాయ్ లో యుద్ధం చూసి వణికిపోయాం.. సానియా మీర్జా
FONT SIZE
GET APP

Sania Mirza: మిడిల్ ఈస్ట్ దేశాలలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నివసిస్తున్న భారతీయులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కుమారుడు ఇజ్ హాన్ తో కలిసి క్షేమంగా దుబాయ్ నుండి భారత్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న అనుభవాలు అక్కడి భయానక స్థితికి అద్దం పడుతున్నాయి.

Read Also: Rail One App: రైల్ వన్’ యాప్‌లో ఉచిత ఓటీటీ వినోదం!

Sania Mirza: దుబాయ్ లో యుద్ధం చూసి వణికిపోయాం.. సానియా మీర్జా
Sania Mirza: We were shocked to see the war in Dubai.. Sania Mirza

తాము ఉన్న ఇంటి పై నుంచి యుద్ధ విమానాలు వెళ్లాయని పేర్కొన్నారు సానియా మీర్జా. ఆ యుద్ధ విమానాలు ఒకదానికొకటి అడ్డుకోవడం చూసామని తెలిపారు. తమ ఇంటికి 400 నుంచి 500 మీటర్ల దూరంలోనే విమానాల శకలాలు పడ్డాయి అని గుర్తు చేశారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉండి వణికిపోయినట్లు వివరించారు. ప్రస్తుతం కొడుకుతో కలిసి హైదరాబాద్ కు వచ్చిన ఆమె, రంజాన్ పండుగ ముగిసిన తర్వాత పరిస్థితులు చక్కబడితేనే తిరిగి దుబాయ్ వెళ్లాలని భావిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.